
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఓ హాలీవుడ్ హారర్ మూవీ కూడా అందుబాటులోకి వచ్చేసింది. జాంబీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత, 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ డాని బోయెల్ దర్శకత్వం వహించాడు. జూన్‌లో ఇది థియేటర్లలోకి రాగా అలా నెల దాటిందో లేదో ఇప్పుడు డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ హారర్ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
2002లో రిలీజైన '28 డేస్ లేటర్', 2007లో విడుదలైన '28 వీక్స్ లేటర్' చిత్రాలకు సీక్వెల్ '28 ఇయర్స్ లేటర్'. దీన్ని రెండు భాగాలుగా తీశారు. ఇందులోని తొలి పార్ట్ జూన్‌లో రిలీజైంది. కాకపోతే థియేటర్లలో అనుకున్నంతగా ఫెర్ఫార్మ్ చేయలేకపోయింది. మరి అందుకేనేమో ఇప్పుడు రెండు ఓటీటీల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వీడియో అన్ డిమాండ్(రెంట్ విధానంలో) అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీల్లో ఈ మూవీ చూడొచ్చు. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఒకరోజు గ్యాప్‌లో రెండు తెలుగు థ్రిల్లర్స్)
'28 ఇయర్స్ లేటర్' విషయానికొస్తే.. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రేజ్ వైరస్ మహమ్మారిలా వ్యాపించేసరికి బ్రిటన్ ప్రజలందరూ జాంబీలుగా మారిపోతారు. వీళ్ల నుంచి తప్పించుకున్న కొందరు.. ఓ ఐలాండ్‌లో బతుకుతుంటారు. మరి అక్కడికి కూడా జాంబీలు ఎలా వచ్చేశారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ. 'ఓపెన్‌హైమర్' నటుడు కిలియన్ మర్ఫీ.. జాంబీ పాత్ర చేశాడు. ఈ మూవీకి రెండో భాగం '28 ఇయర్స్ లేటర్: ది బోన్ టెంపుల్'.. వచ్చే జనవరిలో థియేటర్లలోకి రానుంది.
ఇకపోతే ఈ వారం ఓటీటీల్లోకి దాదాపు 25కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో పలు తెలుగు చిత్రాలు కూడా ఉండటం విశేషం. 3 బీహెచ్‌కే, తమ్ముడు, నెట్‌వర్క్, జిన్ ద పెట్ లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు మరికొన్ని సర్‍ప్రైజ్ రిలీజ్ ఉండొచ్చు.
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' సినిమా.. విజయ్-భాగ్యశ్రీ పారితోషికం ఎంత?)