
ప్రతివారంలానే ఈసారి కూడా ఓటీటీల్లోకి దాదాపు 20కి పైగా సినిమాలు వస్తున్నాయి. వాటిలో తమ్ముడు, 3 బీహెచ్‍కే లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ చిత్రాలు ఈ వీకెండ్‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో రెండు తెలుగు థ్రిల్లర్స్ కూడా రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రాలేంటి? ఎందులోకి రానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.
కొన్నిరోజుల క్రితం తమిళ హారర్ ఫాంటసీ సినిమా 'జిన్ ద పెట్'.. సన్ నెక్స్ట్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఆగస్టు 01 నుంచి తెలుగులోనూ చూడొచ్చని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా పోస్ట్ పెట్టింది. చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు)
'జిన్ ద పెట్' విషయానికొస్తే.. జిన్ అనే దెయ్యం ఉన్న పెట్టెని శక్తి(ముగెన్ రావ్).. తన ఇంటికి తీసుకొస్తాడు. అయితే దీని వల్ల తన ఫ్యామిలీ కష్టాలపాలవుతుందని అనుకుంటాడు. కానీ బాక్స్‌లోని దెయ్యం వీళ్లకు సాయం చేస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం సంగతేంటి? వీళ్లకు ఎందుకు సాయం చేస్తుందనేది మిగతా స్టోరీ.
'నెట్‌వర్క్' అనే టెక్నో థ్రిల్లర్ సిరీస్.. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. జూలై 31 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీరామ్ , శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించారు. మనకు రోజువారీ ఫోన్ అనేది చాలా అలవాటు అయిపోయింది. ఒకవేళ మన ఫోన్లో సిగ్నల్ రోజంతా మిస్ అయితే? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలా నలుగురికి జరిగితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన తెలుగు సిరీస్ ఇది. థ్రిల్లర్స్ కావాలనుకునేవాళ్లు వీటిపై ఓ లుక్కేయొచ్చు.
(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీలో పక్కా చూడాల్సిన సినిమా)