
'అర్జున్ రెడ్డి', 'గీతగీవిందం' సినిమాల తర్వాత విజయ్ దేవరకొండకు సరైన హిట్ పడలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'కింగ్డమ్' చేశాడు. దీనిపై బోలెడన్ని ఆశలు పెట్టేసుకున్నాడు. అందుకు తగ్గట్లే మూవీపై హైప్ రోజురోజుకీ బాగానే పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం టికెట్ బుకింగ్స్‌లోనూ అది క్లియర్‌గా కనిపిస్తోంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.
శ్రీలంక బ్యాక్ డ్రాప్‌లో తీసిన 'కింగ్డమ్' సినిమాలో అన్నదమ్ముల ఎమోషన్‌తోపాటు యాక్షన్ కూడా కాస్త ఎక్కువగానే ఉండబోతుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశారు. అనిరుధ్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవి కూడా మూవీపై కాస్త అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. ఇందులో విజయ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, అన్న పాత్రలో సత్యదేవ్ నటించాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు)
విజయ్ దేవరకొండ సూరి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. కానిస్టేబుల్, అండర్ కవర్ ఏజెంట్, ఖైదీ.. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకుగానూ విజయ్ రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతడి తర్వాత అనిరుధ్‌కి రూ.10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు గౌతమ్ రూ.7 కోట్లు వరకు అందుకున్నట్లు టాక్. అన్న పాత్ర చేసిన సత్యదేవ్ కి రూ.3 కోట్లు, హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీకి రూ.కోటి పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. 'కింగ్డమ్' చిత్రానికి మొత్తంగా రూ.130 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు చెప్పుకొచ్చారు. వీటిలో ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి రేటుకు కొనుగోలు చేసింది. థియేటర్‌లో హిట్ టాక్ వస్తే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశముంది. ఎందుకంటే ఈ వీకెండ్ రిలీజయ్యే వాటిలో ఇదే పెద్ద చిత్రం. మరో రెండు వారాల తర్వాత గానీ కూలీ, వార్ 2 రావు. హిట్ టాక్ వస్తే అప్పటివరకు 'కింగ్డమ్'దే హవా.
(ఇదీ చదవండి: 63 ఏళ్ల స్టార్ హీరోతో 37 ఏళ్ల హీరోయిన్ ప్రేమ?)