
తమిళ నటుడు సత్యరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. 'బాహుబలి' కట్టప్పగా చాలా ఫేమస్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఇతడు ధనుష్ 'ఇడ్లీ కడై' మూవీలో కీలక పాత్ర పోషించాడు. అక్టోబరు 01న ఈ చిత్రం తెలుగు, తమిళంలో థియేటర్లలోకి రానుంది. శనివారం సాయంత్రం ట్రైలర్ లాంచ్ జరగ్గా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: నా పుట్టినరోజునాడే తను చనిపోయాడు.. హీరోయిన్ రాశి)
'రాజమౌళి, ధనుష్ ఇద్దరితో పనిచేయడం పోల్చిచూస్తే.. ధనుష్‌తో పనిచేయడమే కష్టం. ఎందుకంటే దర్శకుడిగా ధనుష్‌కి చాలా క్లారిటీ ఉంది. ఇడ్లీ కడై ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ ఎంటర్ టైన్‌మెంట్ సినిమా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఢమాల్ డుమాల్ అనే యాక్షన్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇది అలాంటి మూవీ కాదు. ఇదో ఫీల్ గుడ్ మూవీ' అని సత్యరాజ్ చెప్పుకొచ్చాడు.
రాజమౌళి డైరెక్షన్ అంటే నటీనటులని బాగా కష్టపెడతాడనే పేరుంది. అలాంటిది ఈ డైరెక్టర్ కంటే ధనుష్ డైరెక్షన్‌లో పనిచేయడం కష్టమని సత్యరాజ్ చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇకపోతే ఈ మూవీ 'ఇడ్లీ కొట్టు' పేరుతో తెలుగులో రిలీజ్ కానుంది. మురళి అనే ఓ కుర్రాడు.. చెఫ్‌గా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. కానీ వారసత్వంగా వచ్చిన ఓ ఇడ్లీ కొట్టు నడిపేందుకు తిరిగి సొంతూరికి వచ్చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. మరి మూవీ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!)