
శుభాకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి, స్నేహితులు, ప్రేయసి రావే.. ఇలా పలు సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రాశి (Raasi). ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. హీరోయిన్‌గానే కాకుండా నిజం మూవీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ యాక్ట్ చేసి మెప్పించింది. చాలాఏళ్ల తర్వాత మళ్లీ ఆమె సినిమాలతో బిజీ అవుతోంది.
చిరంజీవితో సినిమా
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాశి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. నేను చెన్నైలోని తెలుగు కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు మేకప్ వేసుకోవడం నచ్చదు, సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒక్కసారి యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చాక నేను చేసే పనిని ఎప్పుడూ తక్కువ చూడలేదు. నా పనిని నేనెంతో గౌరవిస్తాను. ఇండస్ట్రీకి వచ్చేవారికి కూడా పనిని గౌరవించడం నేర్చుకోమని చెప్తాను.
పెళ్లికూతురినయ్యాక..
ఇకపోతే నేను చిరంజీవితో ఓ సినిమా చేయాల్సింది. ఆర్తి అగర్వాల్‌కు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ దర్శకుడితో చిరంజీవి విభేదాల కారణంగా సినిమా ఆగిపోయింది. రంగస్థలం సినిమాలో సుకుమార్.. రంగమ్మత్త పాత్ర ఆఫర్ చేశారు. ఆ పాత్రలో నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారో, లేదోనన్న భయంతో రిజెక్ట్ చేశాను. నాకు 2004లో పెళ్లయింది. ఆ సమయంలోనే సౌందర్య చనిపోయింది. నన్ను పెళ్లికూతురిని చేశాక బెంగళూరులో సౌందర్య సంతాపసభకు వెళ్లొచ్చాను.
మొదటిరోజే అలాంటి సీన్
పెళ్లయిన పదేళ్లకు పాప పుట్టింది. అదే నా జీవితంలో మ్యాజికల్ మూమెంట్. డైరెక్టర్ తేజ 'నిజం' సినిమాలో నా క్యారెక్టర్‌ను పాజిటివ్‌గా చెప్పాడు. తీరా సెట్‌కు వెళ్లాక మొదటి రోజే నాతో చేయకూడని సీన్ చేయించారు. అసలు ఈ సీన్ ఉంటుందనే చెప్పలేదు. చాలా హర్టయ్యాను, ఈ సినిమా చేయనన్నాను. నాకున్న ఇమేజ్‌కు ఈ సినిమా చేశానంటే కెరీర్ ఇంతటితో ఆగిపోతుంది, నా వల్ల కాదన్నాను. వాళ్లు చేయాల్సిందేనన్నారు. అయిష్టంగానే మూవీ పూర్తి చేశాను.
క్షమించలేను
డబ్బింగ్ సమయంలో తేజ ఫోన్ చేసి సారీ చెప్పారు. ఈ మూవీ విషయంలో మాత్రం ఆయన్ను నేను క్షమించలేను. ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్‌ను మర్చిపోవాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు తేజ పేరే చెప్తాను. ఆ సినిమా వల్ల నిజంగానే కెరీర్ దెబ్బతింది. నా పుట్టినరోజే నాన్న చనిపోయాడు. అది మర్చిపోలేని విషాదం. నా కెరీర్ మొదట్లో నాన్న నాకు అసిస్టెంట్‌లా, టచప్ బాయ్‌లా పనిచేసేవారు అంటూ రాశి ఎమోషనలైంది.