
ప్రముఖ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) మృతిపై తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సినిమా సెట్‌లో స్పృహ తప్పి పడిపోయిన ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. రోబో శంకర్ (Robo Shankar) మృతి పట్ల కమల్ హాసన్, ధనుష్, శివకార్తికేయన్, ఐశ్వర్య రాజేశ్ సహా పలువురు సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేశారు.
అంత్యక్రియల్లో చివరిసారిగా..
రోబో శంకర్ మృతితో అతడి భార్య ప్రియాంక కన్నీరుమున్నీరుగా విలపించింది. శుక్రవారం నటుడి అంత్యక్రియలు జరగ్గా.. చివరిసారి భర్తకు డ్యాన్స్‌తో వీడ్కోలు పలికింది. మనసులో విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతం లాంటి బాధను డ్యాన్స్ రూపంలో వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ప్రియ ఈ బాధ నుంచి ఎలా బయటపడుతుందో? ఏంటో? అని కామెంట్లు చేస్తున్నారు.
ఎవరీ రోబో శంకర్?
కాగా శంకర్.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు రోబో శంకర్‌గా స్థిరపడిపోయింది. మారి, ఇరుంబు తిరై, విశ్వాసం, చక్ర, కోబ్రా, కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్నారు. దాదాపు 80కి పైగా సినిమాలు చేశారు. ఈయన భార్య ప్రియాంక కూడా కన్ని మేడమ్ సినిమాలో నటించింది. వీరి కుమార్తె ఇంద్రజ.. విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) మూవీలో గుండమ్మగా నటించింది.
చదవండి: మా అధ్యక్షుడి అక్కకే ఇలాంటి గతి.. అయినా స్పందించవా?: హేమ