పేరు చెప్పలేను! | Actress Vaishnavi Chaitanya About Life Journey | Sakshi
Sakshi News home page

పేరు చెప్పలేను!

Dec 20 2025 11:06 PM | Updated on Dec 20 2025 11:06 PM

Actress Vaishnavi Chaitanya About Life Journey

యూట్యూబ్‌ ఫ్రేమ్‌ నుంచి సినిమా ఫ్రేమ్‌ దాకా చేరిన నటి వైష్ణవి ప్రయాణం మాటల్లో సులభం, కాని మనసుల్లో మాత్రం అద్భుతం! ఆ మార్గంలో ఆమె చూసిన ఆనందాలు, నేర్చుకున్న పాఠాలు అన్నీ ఆమె మాటల్లోనే, మీ కోసం!

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన అమ్మాయిని నేను. చిన్నప్పటి నుంచే టీవీలో పాటలు వస్తే డ్యాన్స్ చేస్తూ, పుస్తకాలలో ఉన్న కథలను యాక్ట్‌ చేస్తూ ఉండేదాన్ని. అదే నన్ను యూట్యూబ్‌ వీడియోలు చేయించి, ఈరోజు సినిమాల దాకా తీసుకువచ్చాయి.

నా కెరీర్‌ నిజంగా ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌తో మలుపు తిరిగింది. ఆ సిరీస్‌ నాకు నటిగా నమ్మకం ఇచ్చింది. తర్వాత ‘అల వైకుంఠపురములో’ చిన్న పాత్రలో కనిపించాను. అవకాశం చిన్నదైనా, ఆ సినిమాలో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘బేబీ’ సినిమా నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సినిమాకు వచ్చిన ప్రేమ, గుర్తింపు, అవార్డులు ఇవన్నీ నాకింకా కలలా అనిపిస్తాయి.

ఇష్టమైన హీరో ఎవరని అడిగితే, ఏ పేరూ చెప్పలేను. కాని, కష్టపడి ఎదిగిన నటులంటే చాలా గౌరవం.

నేను పాతబస్తీ గల్లీలలో పెరిగిన అమ్మాయి కాబట్టి, ఆ ప్రదేశం ఇప్పటికీ నాకు హాయిగా అనిపిస్తుంది. తినే విషయానికి వస్తే నేనొక ఫూడీ. మసాలా నాన్ అయితే చాలు, చికెన్ ఉంటే ఇంకా ఇష్టం. టైమ్‌ దొరికితే సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడడం, ప్రయాణాలు చేయడం నాకు రిలాక్సేషన్‌లా ఉంటుంది.

అందం గురించి చెప్పాలంటే, నేను చాలా సింపుల్‌. ఉదయం నీటితోనే ముఖం కడుక్కుంటాను. తేలికపాటి మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ వాడతానంతే! ఇదే నా రొటీన్. జుట్టు విషయంలో మాత్రం గోట్‌ మిల్క్‌ షాంపూ, హెయిర్‌ ఆయిల్‌ వాడతాను.

ఫ్యాషన్ ట్రెండ్‌లు ఎలా ఉన్నా, నాకు కంఫర్ట్‌ ఇచ్చే దుస్తులే వేసుకుంటాను. చీరలు, అనార్కలి, లెహెంగాలు వేసుకోవడం చాలా ఇష్టం.

గాసిప్స్‌ విషయానికి వస్తే, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం నేను సింగిల్‌నే. రూమర్స్‌ వచ్చినా వాటికి స్పందించకుండా నేను నా పనిపైనే దృష్టి పెడతాను. ‘బేబీ’ తర్వాత నా రెమ్యునరేషన్ పెరిగిందని చెబుతారు, కాని, నిజంగా పెరిగింది ప్రేక్షకులు ఇస్తున్న ప్రేమ, గౌరవం.

ప్రస్తుతం ఒక ఎమోషనల్‌ స్టోరీ చేస్తున్నా. ఆ పాత్ర కూడా చాలా డీప్‌గా ఉంటుంది. ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కాని, ఇది నా కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్రగా నిలవడం ఖాయం.

నన్ను గుర్తు చేసుకునేప్పుడల్లా నేను చేసిన మంచి పాత్రలే ముందుగా కనిపించాలి. అందుకే, చేస్తున్న ప్రాజెక్ట్స్‌ అన్నీ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాను. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement