బాలనటుడిగా పలు సినిమాలు చేసిన అభినవ్ మణికంఠ హీరోగా చేస్తున్న కొత్త మూవీ 'బొమ్మ హిట్'. గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు. రాజేష్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్. ఈ చిత్రం నేడు(డిసెంబరు 20) పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. బొమ్మ హిట్ సినిమా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సిచ్యుయేషనల్ కామెడీతో వినోదాన్ని ఇస్తుంది. ఈ మధ్య కామెడీ చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మా బొమ్మ హిట్ సినిమాను కూడా హిట్ చేస్తారని కోరుకుంటున్నా అని అన్నాడు. రాబోయే వేసవికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నామని దర్శకుడు రాజేష్ చెప్పుకొచ్చారు.


