హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అని పిలిచి అవమానించారు | Suhas Reveals Bad Experience With Telugu Movie Latest | Sakshi
Sakshi News home page

Suhas: ఇతడిని ఎందుకు పిలిచారు అని నా ముఖంమీదే

Feb 18 2026 7:10 AM | Updated on Feb 18 2026 8:28 AM

Suhas Reveals Bad Experience With Telugu Movie Latest

టాలీవుడ్‌లో లెక్కలేనంత మంది హీరోలున్నారు. స్టార్స్ పెద్దగా కష్టాల్లాంటివి ఉండవు గానీ చిన్న హీరోలు మాత్రం చాలా కష్టపడి పైకొచ్చినవాళ్లే. అలాంటి వాళ్లలో సుహాస్ ఒకడు. షార్ట్ ఫిల్మ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ఇప్పుడు తెలుగు హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అడపాదడపా మూవీస్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తనకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ ఘోర అవమానాన్ని గుర్తుచేసుకున్నాడు. దానితో లింక్ చేస్తూ తను ఇప్పుడు ఎంత సక్సెస్ అయ్యాననే విషయాన్ని కూడా బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. 4 నెలలకు స్ట్రీమింగ్)

'ఓ సినిమాకు యాక్టర్‌గా వెళ్లినప్పుడు పెద్ద హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర దక్కింది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత.. ఇతడిని ఎందుకు పిలిచారని అక్కడే నన్ను అవమానించారు. ఆమె పక్కన నిలబడే అర్హత కూడా లేదన్నారు. కట్ ఇప్పుడు కీర్తి సురేశ్‌తో 'ఉప్పు కప్పురంబు' అనే మూవీ చేశాను. నా విషయంలో ఇది సక్సెస్. పెద్ద హీరోయిన్ పక్కన నేను పనికిరాను అని అన్నోళ్లు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతెందుకు కీర్తి సురేశ్ లాంటి హీరోయిన్లు.. నేను కనిపిస్తే హగ్ కూడా ఇస్తున్నారు' అని సుహాస్ చెప్పుకొచ్చాడు.

ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'హే బల్వంత్'. శివానీ నాగారం హీరోయిన్. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారమే థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ బిజినెస్ అనే కాన్సెప్ట్‌తో తీసినట్లు ట్రైలర్ బట్టి అర్థమైంది. 

(ఇదీ చదవండి: సరైన న్యాయం దక్కలేదు.. సుప్రీం తీర్పుపై ప్రత్యూష తల్లి ఆవేదన)

Advertisement
 
Advertisement
Advertisement