‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. మంచు మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 24న నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘ఆయా షేర్’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.
‘‘ది ప్యారడైజ్’ టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు మూవీపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మా సినిమాకి అనిరుధ్ రవిచందర్ చక్కని సంగీతం అందించారు. ‘ఆయా షేర్’పాటని సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీలో వందలాది మంది డ్యాన్సర్లతో నానిపై భారీ సెట్లో చిత్రీకరించాం. ఈ సాంగ్ నాని ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్‌లా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి కెమెరా: సీహెచ్ సాయి.


