మారుతి కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ | Interesting discussion on Maruti new project | Sakshi
Sakshi News home page

మారుతి కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ

Feb 17 2026 11:01 PM | Updated on Feb 18 2026 8:44 AM

Interesting discussion on Maruti new project

దర్శకుడు మారుతికి ‘రాజాసాబ్’ సినిమా ఫలితం పెద్ద షాక్‌నే ఇచ్చింది. ఆ సినిమా పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. కానీ విమర్శల బాణాలు మాత్రం మారుతి వైపే ఎక్కువగా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన మరో కొత్త స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డారు. మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మారుతి కేరళలో ప్రశాంతంగా కూర్చుని తన దగ్గర ఉన్న ఒక పాయింట్‌ను పూర్తి స్క్రిప్ట్‌గా మార్చారు. అయితే ఆ కథకు హీరో ఎవరు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దృష్టి మాత్రం హీరో రామ్, హీరో వరుణ్ తేజ్‌లపై ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమా నిర్మాణం మైత్రీ మూవీస్‌తో జరగనుంది. మైత్రీలో మారుతి సినిమా ఎప్పటి నుంచో ప్లాన్‌లో ఉంది. కానీ ఇప్పటివరకు ఫైనల్ మాత్రం కాలేదు. చూస్తుంటే ఇప్పుడు ఆ అవకాశం నిజమయ్యేలానే ఉంది. ప్రస్తుతానికి రామ్ చేతిలో సినిమా లేదు. రెండు స్క్రిప్ట్‌లు వర్క్‌లో ఉన్నాయి. ఒకవేళ అవి కాకపోతే మారుతి స్క్రిప్ట్‌తో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక వరుణ్ తేజ్ విషయానికి వస్తే యువి క్రియేషన్స్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ఒకసారి మారుతి స్క్రిప్ట్ విన్న తర్వాత రామ్ లేదా వరుణ్ తేజ్‌ ఇద్దరిలో ఎవరు ఓకే చెబుతారో స్పష్టత వస్తుంది.

అయితే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మైత్రీ మూవీస్- మారుతి కాంబినేషన్ ఫైనల్ అయితే టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement