సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని టీమ్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.
హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.
దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్ వచ్చింది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్
సంగీతమందించారు.


