breaking news
Nilave Movie
-
'మూడేళ్ల కష్టం.. ఈ మూవీ మాకు బాహుబలితో సమానం'
సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించిన చిత్రం నిలవే. ఈ చిత్రానికి సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకులుగా వ్యవహరించారు. పీఓవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్రబోస్ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని టీమ్‌ను అభినందించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. 'ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో నిలవే సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచింది. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారు. డైరెక్టర్ సాయి కే వెన్నం, టీమ్ అందరికీ నా శుభాభినందనలు 'అని అన్నారు.హీరో సౌమిత్ మాట్లాడుతూ ..'కొత్త వాళ్లమైనా మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి కూడా బాహుబలిని ఆడియెన్స్ ముందుకు తీసుకురావడానికి మూడేళ్లు పట్టింది. మా నిలవే మాకు బాహుబలి లాంటిది. ఈ జర్నీలో మాకెన్ని ఇబ్బందులొచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్లాం. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇస్తుంది. జెన్యూన్ హిట్‌గా మా చిత్రం నిలిచింది. నాలుగు రోజులుగా ఆడియెన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్, హౌస్‌ఫుల్ బోర్డ్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం'అని అన్నారు.దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ..'మమ్మల్ని ఆదరించిన అందరికీ థ్యాంక్స్. మూడేళ్ల క్రితం మొదలైన ఈ జర్నీ ఇక్కడవరకు వచ్చింది. ఈ మూవీ మేకింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా ఎందుకు తీయాలనే కారణం తెలుసుకుంటే అన్ని బాగుంటాయని కొత్తగా వచ్చే మేకర్స్‌కు చెప్పగలను. టీమ్ అందరి సపోర్ట్‌తోనే సక్సెస్ వచ్చింది'అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్సంగీతమందించారు. -
'నిలవే' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మరో డాక్టర్ (ఫొటోలు)
-
‘నిలవే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: నిలవేనటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులునిర్మాణ సంస్థ: POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నందర్శకత్వం - సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నంసంగీతం: కళ్యాణ్ నాయక్సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026ట్రైలర్ రిలీజ్ వరకు నిలవే చిత్రం గురించి ఎవరికీ తెలియదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది. చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఈ చిత్రం అ అంచనాలను అందుకుందా? లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్(సౌమిత్ రావు) అనాథ. స్నేహితుడు(వైవా హర్ష) ఇంట్లో ఉంటూ ఓ యాడ్ ఏజెన్సీలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుంటాడు. అతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుండేది అనుకుంటాడు. కానీ ఆయన జీవితంలోకి అమ్మాయి రాదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో నుంచి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమే అతిథి(శ్రేయాసి సేన్). తొలి చూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. పరిచయం పెంచుకొని దగ్గరకు అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ ప్రేమను అంగీకరించలేకపోతుంది. దానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఓ మంచి ప్రేమ కథని సంగీతానికి ముడిపెడుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం. ఒంటరి జీవితం వద్దనుకునే అబ్బాయి.. అందర్నీ వదిలేసి ఒంటరిగా బతకాలనుకున్న అమ్మాయి.. వీరిద్దరి ప్రేమ కథే ఈ సినిమా. హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా సినిమా ప్రారంభం అవుతుంది. ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే అర్జున్ పాత్రను చూస్తే అర్థమవుతుంది. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి.అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం అర్థమైపోతుంది. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచుకుంది. ఇక ద్వితియార్థం కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. అతిథి ప్లాష్‌బ్యాక్ స్టోరీ గుండెను బరువెక్కిస్తుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ, థియేటర్స్‌కి వెళ్లి చూసిన వారికి మాత్రం గొప్ప అనుభూతిని అందిస్తుసింది.ఎవరెలా చేశారంటే...ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగతా నటీనటులంతా కొత్తవారే.అయినప్పటికీ చక్కగా నటించారు. అర్జున్ పాత్రకు సౌమిత్ రావు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్ ఇరగదీశాడు. ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా నటించాడు. తెరపై బాలీవుడ్ హీరోలా కనిపించాడు. ఇక అతిథిగా శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా జాగ్రత్త పడింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కళ్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. పాటలు వినసొంపుగా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సఖి, ఏ మాయే చేశావే తరహాలో ‘నిలవే’ : సింగర్ సునీత
ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అలా అన్నీ ఎమోషన్స్ చూపించేలా ఉన్న చిత్రమే ’నిలవే‘. అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు ఉన్న సినిమా ఇది. క్లాసికల్ మూవీస్ సఖి, ఏ మాయే చేశావే తరహాలో మంచి ఫీల్ గుడ్ సినిమా అవుతుందని భావిస్తున్నా’ అన్నారు సింగర్ సునీత. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో సింగర్ సునీత మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. ఇందులోని పాటలు బాగున్నాయని ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక ఉండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. ఫిబ్రవరి 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది. నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ మూవీస్ లో కె.జి.ఎఫ్. ఎలా ఉందో లవ్ స్టోరీస్ లో కే జీ ఎఫ్ - నిలవే’ అన్నారు.హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ‘నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా ఉంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి కృషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని దర్శకుడు సా కే వెన్నం అన్నారు. -
అర్జున్ రెడ్డిని గుర్తు చేసేలా కొత్త సినిమా ట్రైలర్..
'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా పేరు పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఈ మూవీ టేకింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే, తాజాగా విడుదలైన 'నిలవే' మూవీ ట్రైలర్‌కు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది. ఈ ట్రైలర్‌ను చూసిన నెటిజన్లు చిత్ర దర్శకుడిని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. వీడేంటి సందీప్‌రెడ్డి స్టూడెంట్‌లా ఉన్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్లో కట్స్, ఎడిటింగ్, సంగీతం సూపర్ అంటూనే హీరోయిన్ పాత్రలో కనిపించిన శ్రేయాసి సేన్ నటన అదుర్స్ అంటున్నారు.సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి నిలవే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రేయాసి సేన్ కథానాయికగా నటిస్తుంది. రాజ్ అల్లాడ, గిరిధర్‌రావు పోలాడి, సాయి కె.వెన్నం నిర్మాతలు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు మంచి ఆదరణ రావడంతో సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రేయాసి సేన్‌కు మంచి గుర్తింపు వస్తుంది. -
ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘నిలవే’
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. పీఓవీ(POV) ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది.ఈ చిత్రంలో సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించగా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.


