ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘నిలవే’ | Nilave Movie Release Date Out | Sakshi
Sakshi News home page

ప్రేమికుల దినోత్సవం కానుకగా ‘నిలవే’

Jan 20 2026 5:34 PM | Updated on Jan 20 2026 5:58 PM

Nilave Movie Release Date Out

సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. పీఓవీ(POV) ఆర్ట్స్  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ  చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.  ప్రేమికుల దినోత్సవం కానుకగా  ఫిబ్రవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు.  బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన  ఈ చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందినట్టు చిత్ర బృందం వెల్లడించింది.

ఈ చిత్రంలో సౌమిత్  పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా నటించగా హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన పాత్రలతో ప్రతి నటుడు తనదైన ముద్ర వేయనున్నారని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  ఈ  సినిమాకు కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా, దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement