క్లైమాక్స్‌ చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు: విజయ్‌ ఆంటోని | Vijay Antony about Bookie movie | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్‌ చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు: విజయ్‌ ఆంటోని

Feb 18 2026 12:03 AM | Updated on Feb 18 2026 12:03 AM

Vijay Antony about Bookie movie

గణేష్‌ చంద్ర, విజయ్‌ ఆంటోనీ, లక్ష్మి, ధనుషా

అజయ్‌ ధీషన్, ధనుషా హీరో హీరోయిన్లుగా గణేష్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బూకీ’. విజయ్‌ ఆంటోనీ సమర్పణలో శర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. సునీల్, లక్ష్మి మంచు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికీ తమిళంలో విడుదలైంది. తెలుగులో ఈ నెల 20న విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌ చేశాను. ఇది యూనివర్సల్‌గా కనెక్ట్‌ అయ్యే యూత్‌ఫుల్‌ సినిమా’’ అన్నారు. ఈ సినిమా సమర్పకుడు, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులు మంచి టాలెంట్‌ను ప్రోత్సహిస్తారు. ‘మార్గన్‌’ సినిమాతో నటుడిగా అజయ్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ‘బూకీ’లోనూ అజయ్‌ నటన ఆడియన్స్‌ను అలరిస్తుంది.

లక్ష్మి, సునీల్‌గార్లు అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్‌ చూసినప్పుడు ఆడియన్స్‌కు కన్నీళ్లు వస్తాయి. సురేష్‌ ప్రోడక్షన్స్, నిర్మాత రామ్‌లతో ఇకముందు కూడా మా అసోసియేషన్‌ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘హీరోగా నేను చేసిన తొలి సినిమా ఇది’’ అని చెప్పారు అజయ్‌. ‘‘నేను తమిళ్‌ అబ్బాయిని. కానీ విజయవాడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇక ఈ సినిమాలో మంచి సర్‌ప్రైజ్‌ ఉంది’’ అని చెప్పారు గణేష్‌ చంద్ర. రచయిత భాష్యశ్రీ మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement