థ్రిల్‌ స్టార్ట్‌ | Aadhi Pinisetty begins shooting for Marakatamani 2 | Sakshi
Sakshi News home page

థ్రిల్‌ స్టార్ట్‌

Feb 18 2026 12:18 AM | Updated on Feb 18 2026 12:18 AM

Aadhi Pinisetty begins shooting for Marakatamani 2

ప్రియాభవానీ, ఆది, నిక్కీ

ఆది పినిశెట్టి హీరోగా నటించిన హిట్‌ మూవీ ‘మరకతమణి’ (2017)కి సీక్వెల్‌గా ‘మరకతమణి 2’ సినిమా ఆరంభమైంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఏఆర్‌కే శరవణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

సుధన్‌ సుందరం, మనీష్‌ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్‌ – కేవీ దురై నిర్మిస్తున్నారు. చెన్నైలో జరిగిన ఈ చిత్రం ప్రారంబోత్సవానికి హీరో కార్తీ అతిథిగా హాజరై, క్లాప్‌ కొట్టగా, హీరో ఆర్య, దర్శకుడు వెంకట్‌ ప్రభు ‘కెమెరా రోలింగ్, యాక్షన్‌’ అంటూ షూటింగ్‌ ఆరంభించారు. ‘‘మరకతమణి 2’ చిత్రం ప్రేక్షకులకు మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్‌ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ధిబు నినాన్‌ థామస్, కెమెరా: పీవీ శంకర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: మోహన్‌ .పి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement