కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్.. అమిగోస్ మూవీతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ వెంటనే నా సామిరంగ మూవీలో నాగార్జునతో జతకట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే హీరో రవితేజ సరసన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా చిట్‌చాట్ నిర్వహించింది.
సీనియర్ హీరోలతో జోడీ..
ఈ కార్యక్రమంలో ఆషికాకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, రవితేజ వంటి సీనియర్ హీరోలతో జతకడుతున్నారు.. మీ వయసుకు తగ్గ పాత్రలు రావట్లేదని ఫీలవుతున్నారా? అని ఓ విలేఖరి అడిగాడు. అందుకు ఆషిక మాట్లాడుతూ.. ఒక నటిగా ఎన్ని విభిన్న పాత్రల్లో నటించాలనేదానిపైనే ఫోకస్ పెడతాను.
ఏజ్ గ్యాప్‌పై ఓపెనైన బ్యూటీ
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఈ జనరేషన్‌కు తగ్గట్లుగా యంగ్, మోడ్రన్ అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా సామిరంగా మూవీలో పరిణతి ఉన్న పాత్రలో నటించాను. భిన్న పాత్రలు చేయాలనే ఆ సినిమా ఒప్పుకున్నాను. సీనియర్ హీరోలతో నటించినప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ దొరుకుతుంది. పాత్ర నచ్చినప్పుడు ఏజ్ గ్యాప్ గురించి పట్టించుకోను. సీనియర్ హీరో, యంగ్ హీరో అన్న విషయాలను నేను లెక్క చేయను. కథలో నా పాత్ర ఎంత బలంగా ఉందనేది మాత్రమే ఆలోచిస్తాను అని ఆషిక చెప్పుకొచ్చింది.
చదవండి: శోభిత, సమంతతో నాగచైతన్య


