ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య బాగానే ఉంది. థియేటర్లో ఎటూ బాహుబలి ఎపిక్, మాస్ జాతర చిత్రాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం ‘కొత్తలోక: చాప్టర్ 1’ (kotha lokah chapter 1) ఎట్టకేలకు ఓటీటీలోకి రానుంది. జియో హాట్‌స్టార్ వేదికగా అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇడ్లీ కొట్టు.. తిరు వంటి హిట్ సినిమా తర్వాత ధనుష్, నిత్యామేనన్ కలిసి జంటగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం అక్టోబర్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. కోలీవుడ్లో రూ. 60 కోట్లకు పైగా రాబట్టిన ఈ మూవీలో ధనుష్ పాత్ర చాలా బాగుంటుంది. తన తండ్రి కోరిక మేరకు వారసత్వంగా ఇడ్లీ కొట్టు నడిపే సాధారణ వ్యక్తిలా ధనుష్ మెప్పించారు.
‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) కూడా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అక్టోబర్ 31న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 820 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీ మినహా దక్షిణాదికి చెందిన అన్ని భాషలలో విడుదల కానుంది. కాంతార సినిమాతో థియేటర్లలో తన సత్తా ఏంటో కన్నడ హీరో రిషబ్ శెట్టి చూపించారు. ఆయన దర్వకత్వం వహించిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 27 నుంచి నవంబర్ 2 వరకు)
నెట్‌ఫ్లిక్స్
- ఇడ్లీకొట్టు (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 29
- బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29
- స్టిచ్ హెడ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 29
- ఐలీన్: క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 30
- ద వైట్ హౌస్ ఎఫెక్ట్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు
అమెజాన్ ప్రైమ్
- హజ్బిన్ హోటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 29
- హెడ్డా (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 29
- ట్రెమెంబా (పోర్చుగీస్ సిరీస్) - అక్టోబరు 31
- కాంతార ఛాప్టర్ 1 (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 31
హాట్‌స్టార్
- ఐటీ వెల్కమ్ టూ డెర్రీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 27
- మానా కీ హమ్ యార్ నహీన్ (హిందీ సిరీస్) - అక్టోబరు 29
- లోక (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబరు 31
జీ5
- డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు (తెలుగు సిరీస్) - అక్టోబరు 31
- బాయ్ తుజాప్యా (మరాఠీ సిరీస్) - అక్టోబరు 31
- మారిగళ్లు (కన్నడ సిరీస్) - అక్టోబరు 31
- గణోసోత్రు (బెంగాలీ సిరీస్) - అక్టోబరు 31
- రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్ (మూవీ) అక్టోబరు 31
సన్ నెక్స్ట్
- బ్లాక్ మెయిల్ (తమిళ సినిమా) - అక్టోబరు 30


