
ధనుష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'ఇడ్లీ కొట్టు'. అక్టోబరు 01న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. పూరి గుడిసెలో ఉండే ఓ ఇడ్లీ కొట్టు బ్యాక్ డ్రాప్‌లో సాగే ఓ ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. నిత్యామేనన్, అరుణ్ విజయ్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)
ట్రైలర్ బట్టి చూస్తే మురళి(ధనుష్) తండ్రికి సొంతూరిలో చిన్న ఇడ్లీ కొట్టు ఉంటుంది. అదంటే ఆయనకు ఎంతో ప్రాణం. తండ్రిని చూస్తూ పెరిగిన మురళి.. పెరిగి పెద్దయ్యాక ఓ పెద్ద ఫుడ్ కంపెనీలో జాబ్ సాధిస్తాడు. అక్కడ పనైతే చేస్తుంటాడు గానీ మనసంతా ఊరిలో తమ ఇడ్లీ కొట్టుపైనే ఉంటుంది. తండ్రి తదనంతరం దాన్ని మూసేస్తారు. పెద్ద జాబ్ చేసుకునే మురళి.. ఊరికొచ్చి మళ్లీ తమ ఇడ్లీ కొట్టు ఎందుకు తెరిచాడు? ఈ స్టోరీలో విలన్ ఎవరు? అనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
సెప్టెంబరు 25న తెలుగులో ఓజీ సినిమా రానుంది. దీనిపై అంచనాలు ఉన్నాయి. అలానే అక్టోబరు 2న పాన్ ఇండియా మూవీ 'కాంతార' సీక్వెల్ రాబోతుంది. ఈ రెండింటికి పోటీగా ధనుష్ 'ఇడ్లీ కొట్టు' చిత్రాన్ని బరిలో దింపుతున్నాడు. ఎమోషనే ప్రధానంగా తీసిన ఈ సినిమా.. ట్రైలర్ బట్టి చూస్తుంటే ప్రేక్షకుల మనసు గెలుచుకునేలా కనిపిస్తుంది. మరి 'ఇడ్లీ కొట్టు'.. పోటీలో ఉన్న మిగతా సినిమాలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో?
(ఇదీ చదవండి: రీతూ బండారం బట్టబయలు.. పవన్ కెప్టెన్సీ ఫసక్)