క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్ రిలీజ్ | Christopher Nolan The Odyssey Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

The Odyssey Trailer: ఏడాది ముందే టికెట్స్ అమ్మేశారు.. ఇప్పుడు ట్రైలర్

Dec 23 2025 8:18 AM | Updated on Dec 23 2025 8:21 AM

Christopher Nolan The Odyssey Movie Telugu Trailer

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్.. తెలుగు ప్రేక్షకుల్లోనూ చాలామందికి తెలుసు. ద డార్క్ నైట్స్, ఇన్‌సెప్షన్,  ఇంటర్‌స్టెల్లార్, డన్‌కిర్క్, టెనెట్ లాంటి క్రేజీ టైమ్ ట్రావెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ దక్కించుకున్నాడు. ఇతడి నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇప్పుడు రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్‌ది కూడా విడుదల చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. మరి థియేటర్లలో?)

సాధారణంగా నోలన్ తీసే సినిమాలన్నీ ఫిజిక్స్, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ స్టోరీలతో ఉంటాయి. కానీ కెరీర్‌లో తొలిసారి వార్ మూవీ తీస్తున్నాడు. ట్రైలర్‌లో పెద్దగా స్టోరీ ఏం రివీల్ చేయలేదు గానీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవల్లో ఉండబోతున్నాయని హింట్ అయితే ఇచ్చాడు. వచ్చే జూలై 17న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు డబ్బింగ్ కూడా తీసుకురాబోతున్నారు. విచిత్రం ఏంటంటే మూవీ విడుదలకు ఏడాది ముందే టికెట్ బుకింగ్స్ తెరిస్తే అవి నిమిషాల్లో సేల్ అయిపోయాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement