గతేడాది సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'కూలీ'. ఈ మూవీలో పూజా హెగ్డే ఓ ప్రత్యేక సాంగ్‌కో మెరిసింది. మోనికా అంటూ అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతలా ఈ సాంగ్ సినీ ప్రియులను మెప్పించింది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు పూజా హెగ్డేతో పాటు సౌబిన్ షాహిర్ డ్యాన్స్‌తో మెప్పించాడు.
అయితే తాజాగా ఈ పాటకు ఓ బుడ్డోడు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మూవీ ఈవెంట్‌లో మోనికా సాంగ్‌కు చిచ్చరపిడుగులా అదరగొట్టేశాడు. ఈ బుడ్డోడి స్టెప్పులు చూసిన నెటిజన్స్ పూజా హెగ్డే, సౌబిన్ షాహిర్‌ను మించిపోయేలా చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అబ్బాయి ఎనర్జీ చూసి ఫిదా అయిపోతున్నారు.
కాగా.. రజినీకాంత్ నటించిన కూలీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు.
Yaara nee 🤯🔥 pic.twitter.com/YH1heMRynH
— OTT Trackers (@OTT_Trackers) February 8, 2026


