
బిగ్‌బాస్ ఆడియెన్స్ ఎదురుచూసిన ప్రోమో రానే వచ్చేసింది. ఎందుకంటే ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ట్రాంగ్ ప్లేయర్లు అయిన భరణి, ఇమ్మాన్యుయేల్‌లని కాదని సంచాలక్ రీతూ.. పవన్ కెప్టెన్ అయ్యేలా చేసింది. ఎప్పుడు వీకెండ్ వస్తుందా? ఎప్పుడు నాగార్జున ఈ విషయం గురించి రీతూని కడిగేస్తాడా అని చూశారు. ఇప్పుడు శనివారం ఎపిసోడ్‌లో అదే జరగబోతుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు'.. టాక్ ఏంటి?)
ప్రోమోలో చూపించినట్లు వస్తూవస్తూనే నాగార్జున.. కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడాడు. రీతూ చౌదరి దొంగబుద్ధి చూపించడం, సంచాలక్‌గా ఫేవరిజం చూపించి పవన్ కెప్టెన్ అయ్యేలా చేయడం, దీని గురించి నాగార్జున కౌంటర్స్ వేశారు. అన్యాయంగా భరణిని ఎలిమినేట్ చేయడం, పవన్‌కి కెప్టెన్సీ ఇచ్చేయడం లాంటి విషయాల గురించి అడిగి కడిగిపారేశారు. అలానే రీతూ-పవన్ ముందస్తుగానే మాట్లాడుకుని ఇదంతా చేసినట్లు ఓ వీడియోని హౌస్ అంతా చూపించి రీతూ బండారం బట్టబయలు చేశారు.
అలానే తప్పు పద్ధతిలో కెప్టెన్ అయిన పవన్ నుంచి ఆ పవర్ తీసేసుకున్నారు. ఇలా ప్రోమో ఎండ్ అయింది. మరి పవన్ నుంచి తీసుకున్న కెప్టెన్సీ వేరే ఎవరికైనా ఇస్తారా లేదంటే ఈ వారం కెప్టెన్ లేకుండా హౌస్ నడవబోతుందా అనేది చూడాలి. మరోవైపు ఈ వీక్ నామినేషన్స్‌లో ఏడుగురు ఉన్నారు. వీళ్లలో సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా, హరీష్, మనీష్, పవన్, ప్రియ ఉన్నారు. గతవారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయింది. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: కొంపముంచిన కామెడీ స్పూఫ్.. ఏకంగా రూ.25 కోట్ల దావా)