ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి తెలిసే ఉంటుంది. ఆయన కొడుకు రాజీవ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కాకపోతే ఒక్కటి కూడా హిట్ కాలేదు. 2021లో చిరంజీవి చేతుల మీదగా ఓ మూవీని లాంచ్ చేశారు. అయితే ఆ చిత్రం చాన్నాళ్లుగా థియేటర్‌లో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా?
(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)
కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించిన సినిమా '11:11'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీశారు. అయితే ఆర్థిక కారణాలా లేదా మరే కారణమో తెలీదు గానీ గత రెండు మూడేళ్లుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు. ఎలాగోలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి సైలెంట్‌గా తీసుకొచ్చేశారు. తెలుగులో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' చిత్రాలు బుధ, గురువారాల్లో వరసగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు కూడా డిజిటల్‌గా అందుబాటులోకి రానున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2' ఈ శుక్రవారం ఓటీటీలోకి రానుంది.
(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు)


