breaking news
11:11 Movie
-
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురించి తెలిసే ఉంటుంది. ఆయన కొడుకు రాజీవ్.. హీరోగా పలు సినిమాలు చేశాడు. కాకపోతే ఒక్కటి కూడా హిట్ కాలేదు. 2021లో చిరంజీవి చేతుల మీదగా ఓ మూవీని లాంచ్ చేశారు. అయితే ఆ చిత్రం చాన్నాళ్లుగా థియేటర్లో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా?(ఇదీ చదవండి: హీరోయిన్లకు సలహా సరే.. ఈ 'సామాను' కామెంట్ అవసరమా శివాజీ?)కోటి తనయుడు రాజీవ్ హీరోగా నటించిన సినిమా '11:11'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథతో తీశారు. అయితే ఆర్థిక కారణాలా లేదా మరే కారణమో తెలీదు గానీ గత రెండు మూడేళ్లుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయారు. ఎలాగోలా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి సైలెంట్‌గా తీసుకొచ్చేశారు. తెలుగులో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే రామ్ 'ఆంధ్ర కింగ్ తాలూకా', కీర్తి సురేశ్ 'రివాల్వర్ రీటా' చిత్రాలు బుధ, గురువారాల్లో వరసగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఏక్ దివానే కీ దివానియత్, 'మిడిల్ క్లాస్' చిత్రాలు కూడా డిజిటల్‌గా అందుబాటులోకి రానున్నాయి. అలానే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2' ఈ శుక్రవారం ఓటీటీలోకి రానుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్' కలెక్షన్స్‌లో మాకు షేర్ ఇవ్వాలి: పాక్ ప్రజలు) -
కోటి తనయుడి సినిమాకు రామ్ పోతినేని సాయం
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి హీరోగా నటించిన చిత్రం ‘11:11’. ‘కౌంట్ డౌన్ స్టార్ట్స్’ అనేది క్యాప్షన్. ఆర్కే నల్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని గాజుల వీరేష్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఏమయ్యిందో..’ అనే పాట లిరికల్ వీడియోను హీరో రామ్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి, సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ‘ఏమయ్యిందో మనసైపోయే మాయం.. ఏమౌతుందో ఇకపై నా హృదయం’ అంటూ సాగే ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా అర్మాన్ మాలిక్ ఆలపించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. ‘‘రాజీవ్, వర్ష లవ్ చేసుకుంటుంటారు. ఆ ఇద్దరి మధ్య ఓ వ్యక్తి అనూహ్యంగా ఎంటర్ అవుతాడు. కానీ ఆ వ్యక్తి హత్య చేయబడతాడు. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నదే కథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ పోస్టర్.. ఆకట్టుకున్న వీడియో
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరో తెరకెక్కుతున్న చిత్రం '11:11'. వర్ష విశ్వనాథ్ హీరోయిన్. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా 11: 11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. న ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.


