రానా రిలీజ్ చేసిన 11:11 మోషన్ పోస్టర్.. ఆకట్టుకున్న వీడియో

Music Direcotr Koti Son Rajeev New Movie Motion Poster Lauched By Rana Daggubati - Sakshi

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్ హీరో తెరకెక్కుతున్న చిత్రం '11:11'.  వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌. టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా కిట్టు నల్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సదన్, సీనియర్ హీరో రోహిత్, లావణ్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరో దగ్గుబాటి రానా 11: 11 మోషన్ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.

న ఈ మోషన్ కాన్సెప్ట్ పోస్టర్‌లో కేవలం మూడు క్యారెక్టర్స్ చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. హీరో రాజీవ్ సాలూర్- హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మధ్య లవ్ ట్రాక్, అందులో అనూహ్యంగా ఎంటరైన ఓ వ్యక్తి, అతన్ని హతమార్చడం లాంటి సీన్స్ ఈ వీడియోలో కనిపించాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి తోడు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top