టాలీవుడ్‌లో ఈ ఏడాది ఏదైనా ఓ విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారంటే అది టికెట్ రేట్ల గురించే. పెద్ద సినిమాల రిలీజయ్యే ప్రతిసారి ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. కొన్నిసార్లు అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే చాలా అభిప్రాయాలు వినిపించాయి. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం టికెట్ ధరలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో సల్మాన్ సినిమా.. టీజర్ రిలీజ్)
సీఐటీయూ మహాసభల కోసం వైజాగ్ వచ్చిన ఈ నటుడు.. మీడియాతో మాట్లాడారు. మహిళలపై శివాజీ చేసిన చిల్లర వ్యాఖ్యల గురించి ఘాటుగా స్పందించారు. పురుషుల వల్ల మహిళలకు తరతరాలుగా అన్యాయం జరుగుతోంది, ఓ వేదికపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ విషయంలో అనసూయకే సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఐబొమ్మ రవి దొంగతనం చేశాడని, అది ముమ్మాటికీ తప్పే అని చెప్పుకొచ్చాడు.
ఇలా మాట్లాడుతున్న టైంలోనే.. సినిమా టికెట్ ధరలు ప్రేక్షకులకు భారంగా మారుతున్నాయి? దీనిపై మీ స్పందన ఏంటని ప్రకాశ్ రాజ్‌ని అడగ్గా.. అయితే సినిమాలు చూడకండి. ఎవరి వ్యాపారం వాళ్లది అని కుండబద్దలు కొట్టేశాడు. చూస్తుంటే ఈ వ్యాఖ్యలు కచ్చితంగా వివాదానికి దారితీసేలా ఉన్నాయి. ఎందుకంటే ప్రేక్షకుడిని థియేటర్‌కి ఎలా తీసుకురావాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. ఈ నటుడు మాత్రం ఇలా ఆశ్చర్యకర కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: ఐసీయూలో టాలీవుడ్ 'చిన్న' సినిమా)
"Don't watch Films if you think they're Expensive. Cinema is a Business."
- #PrakashRaj pic.twitter.com/zYYgejLF96— Movies4u Official (@Movies4u_Officl) December 27, 2025


