
తమిళ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఎప్పటికప్పుడు ఇతడి సినిమాలు ఇక్కడ కూడా రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు కొత్త మూవీని రెడీ చేశాడు. ధనుష్ లీడ్ రోల్ చేస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇడ్లీ కడై'. దీన్ని తెలుగులో 'ఇడ్లీ కొట్టు' పేరుతో తీసుకురానున్నారు. ఈ మేరకు తాజాగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: స్టార్ కొరియోగ్రాఫర్.. సైకో పాత్రలతో కేరాఫ్.. ఇతడెవరో తెలుసా?)
పవన్ కల్యాణ్ 'ఓజీ'.. సెప్టెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇదొచ్చిన ఐదు రోజులకే 'ఇడ్లీ కొట్టు' థియేటర్లలోకి వస్తుంది. దీని తర్వాత రోజున 'కాంతార' ప్రీక్వెల్ విడుదల కానుంది. చూస్తుంటే ఈసారి దసరాకు బాక్సాఫీస్ దగ్గర మంచి సందడిగా ఉండనుందని అర్థమైపోతోంది. 'ఇడ్లీ కొట్టు' సినిమా పూర్తిగా కంటెంట్, ఎమోషన్స్‌పై ఆధారపడి తీశారు. ధనుష్, నిత్యామేనన్, అరుణ్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
(ఇదీ చదవండి: 'మిరాయ్'లో శ్రీరాముడు ఇతడే.. ఈ నటుడు ఎవరో తెలుసా?)
