సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్ వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్ సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్ తేదీలు వెల్లడించారు.
తాజాగా మరో టాలీవుడ్ హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది.
కాగా.. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37వ చిత్రంగా నిలవనుంది.
This Sankranthi is set to deliver a HATTRICK BLOCKBUSTER for our Charming Star @ImSharwanand! 🌟
The celebration begins with #NariNariNadumaMurari, hitting theatres January 14th, 2026 from 5:49 PM onwards! 🤩🎋@AnilSunkara1 @iamsamyuktha_ @sakshivaidya99 @RamAbbaraju… pic.twitter.com/akIyawyACH— AK Entertainments (@AKentsOfficial) December 9, 2025


