టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. వరుణ్ సందేశ్ నటిస్తోన్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘నయనం’. ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించనున్నారు.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'కన్ను ట్రాన్స్మీటర్.. నాలుగు నిమిషాలు వాళ్ల జీవితంలో ఏం జరుగుతుందో నేను చూడగలను' అంటూ వరుణ్ సందేశ్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సిరీస్ను సస్పెన్స్తో పాటు సైకలాజికల్ మేసేజ్ ఓరియంటెడ్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ కీలక పాత్రలో నటించింది. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి. ఈనెవల 19 నుంచి జీ5 వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


