జనాలకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నట్లే బిగ్‌బాస్‌కు కూడా ఎవరో ఒకరు నచ్చుతారు. వారికి హైప్ ఇవ్వడానికి, చేసిన తప్పులను కవర్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆదివారం (అక్టోబర్ 26వ) ఎపిసోడ్ చూసిన అందరికీ ఈ విషయం మరోసారి అర్థమై ఉంటుంది. ఇంతకీ ఏం జరిగింది? రమ్య వెళ్లిపోయే ముందు ఏం చెప్పింది? అనేవి చూసేద్దాం..
తప్పు చేసినా తనూజయే విన్నర్
గోల్డెన్ బజర్ కోసం డిమాన్ పవన్, తనూజ, సుమన్, రీతూ పోటీపడ్డారు. ఈ గేమ్‌కు మాధురిని సంచాలకురాలిగా పెట్టారు. పజిల్ గేమ్ తనూజ పైపైనే పూర్తి చేసి, వెళ్లి బజర్ గెల్చుకుంది. నిజానికి ఆమె పజిల్ సరిగా అమర్చలేదు. అదే విషయాన్ని డిమాన్ పవన్ చెప్పాడు. తనూజ పజిల్ సరిగా పెట్టలేదని చెప్తుంటే.. సంచాలక్ నిర్ణయమే ఫైనల్ అంటూ నాగార్జున డిక్లేర్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. తనూజకు ఫేవరిజం చేస్తున్నారని క్లియర్‌గా తెలిసిపోయింది.
రమ్య ఎలిమినేట్
ఇక నాగ్ అందర్నీ సేవ్ చేసుకుంటూ పోగా చివరకు సంజనా, రమ్య (Ramya Moksha) మిగిలారు. వీళ్లిద్దరిలో రమ్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. రమ్య వెళ్లిపోతుంటే మాధురి.. ఆమెను పట్టుకుని ఏడ్చేసింది. తనపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక స్టేజీపైకి వచ్చిన రమ్య.. ప్రతివారం నామినేషన్‌లో ఉంటానని ఫిక్సయి వచ్చాను, కానీ, ఇంత త్వరగా వెళ్తాననుకోలేదని కాస్త నిరాశచెందింది. చివరగా ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న 13 మంది ఫోటోలు బోర్డ్‌పై ఉన్నాయి.. అందులో ఐదుగుర్ని చెత్తబుట్టలో వేయాలన్నాడు.

కల్యాణ్ పరువు తీసిన రమ్య
ముందుగా కల్యాణ్ (Pawan Kalyan Padala) ఫోటో చెత్తబుట్టలో వేస్తూ.. తనకు మెచ్యూరిటీ లేదు, నిబ్బానిబ్బీలా ప్రవర్తిస్తాడు. కాలేజీలో ఫస్ట్ టైమ్ లవ్‌లో పడినట్లుగా ఉంటాడు. తనకి సరిగా మాట్లాడటం కూడా రాదు అని చెప్పింది. దివ్య ఫోటోను డస్ట్‌బిన్‌లో పడేస్తూ.. భరణి వెళ్లిపోయాక దివ్య ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. ఊరికే కోప్పడటం, అవసరం లేకపోయినా వాదించడం చేస్తోంది. అవి కంట్రోల్ చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చింది.
రీతూపై బిగ్‌బాంబ్
తనూజ, గౌరవ్ ఫోటోలను కూడా చెత్తబుట్టలో పడేసింది. తనూజ.. వేరేవాళ్లు చెప్పిన మాటల్ని పట్టుకుని నన్ను మానిప్యులేటర్ అనుకుంటోంది. గౌరవ్ రాక్షసుడు.. చెప్పిన మాట వినడు. మనం మాట్లాడేందుకు 5 సెకన్ల గ్యాప్ కూడా ఇవ్వడు అంది. చివరగా డిమాన్ ఫోటో పడేస్తూ.. నువ్వు నీ గురించే ఆడు.. ఎక్కువ ఎమోషనల్ అవకు, గేమ్ మీద ఫోకస్ చేయ్.. కొన్నిసార్లు ఓవర్ హెల్ప్ చేస్తున్నావ్ అంటూ హెచ్చరించింది. చివరగా రమ్య చేతికి ఓ బిగ్‌బాంబ్ ఇచ్చాడు నాగ్. నీ వాష్ రూమ్ డ్యూటీని హౌస్‌లో ఒకరికి అప్పగించమన్నాడు. అందుకామె వెంటనే రీతూ పేరు చెప్పి.. ఏం చేసినా నీ మంచి కోసమేరా.. అని బిస్కెట్ వేసి వెళ్లిపోయింది.


