బైసన్‌ మూవీ టీమ్‌పై సీఎం ప్రశంసలు | Tamil Nadu CM MK Stalin Appreciates Dhruv Vikram Bison Movie, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బైసన్‌ మూవీకి రివ్యూ ఇచ్చిన సీఎం.. పిలిచి మరీ అభినందనలు

Oct 27 2025 8:46 AM | Updated on Oct 27 2025 10:13 AM

Tamil Nadu CM Stalin Appreciates Dhruv Vikram Bison Movie

మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధ్రువ్‌విక్రమ్‌ (Dhruv Vikram) కథానాయకుడిగా నటించిన చిత్రం బైసన్‌ (Bison Movie). అనుపమ పరమేశ్వరన్, రజీషా విజయన్, పశుపతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అప్లాస్‌ సంస్థతో కలిసి నీలం ప్రొడక్షన్స్‌ పతాకంపై దర్శకుడు పా.రంజిత్‌ నిర్మించారు. నివాస్‌ కే ప్రసన్న సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళనాడులో అక్టోబర్‌ 17న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

బైసన్‌ టీమ్‌ను అభినందించిన సీఎం
బైసన్‌ మూవీ చూసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌.. ఆఫీసుకు పిలిచి మరీ మారిసెల్వరాజ్, ధ్రువ్‌విక్రమ్‌లను అభినందించారు. బైసన్‌ చిత్రం  గురించి ఎక్స్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ.. మారిసెల్వరాజ్‌ సినీమకుటంలో ఇది మరో వజ్రం. ప్రతిభను మాత్రమే నమ్ముకున్న ఒక యువకుడు అటు కబడ్డీ కోర్టులో, ఇటు బయట ఎదురైన సమస్యలను ఎదుర్కొని విజయం సాధించిన కథను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. 

చక్కగా చూపించారు
క్రీడలు నేపథ్యంగా చేసుకుని ఒక యువకుడు చేరుకోవాల్సిన మార్గాన్ని దర్శకుడు మారిసెల్వరాజ్‌ చక్కగా చూపించారన్నారు. అద్భుతమైన నటనతో మారిసెల్వరాజ్‌ కథకి ప్రాణం పోసిన నటుడు ధ్రువ్‌విక్రమ్, పశుపతి, అనుపమ పరమేశ్వరన్, రెజీషా విజయన్‌.. ఇతర నటినటులు, తెర వెనుక శ్రమించిన సాంకేతిక వర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. సీఎం రివ్యూతో పొంగిపోయిన మారి సెల్వరాజ్‌ ఎక్స్‌ మీడియా ద్వారా స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

చదవండి: హిట్‌ మూవీలో వేశ్యగా నటించిన బ్యూటీ.. 'ప్రభాస్‌' ఫౌజీలో ఛాన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement