దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji)లో కన్నడ బ్యూటీ 'చైత్ర జె ఆచార్' (Chaithra J Achar)కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. గతంలో సప్త సాగరాలు దాటి: సైడ్ బి, 3బీహెచ్‌కే వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించినుకున్నట్లు సమచారం. ఫౌజీలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా చైత్ర ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇందులో అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ కూడా భాగం కానున్నారు.
పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ఫౌజీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940లో జరిగిన కథగా ఈ చిత్రం రానుంది. ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఒంటరిగా ఒక యోధుడు చేసే పోరాటం ఈ చిత్రంలో కనిపించనుంది. వాస్తవ సంఘటనలకు కొంత ఫిక్షన్ జోడించి హను రాఘవపూడి ఈ కథను రెడీ చేశారు.

చైత్ర జె. ఆచార్ నటి మాత్రమే కాదు ఒక గాయని కూడా.. బెంగళూరులో పుట్టిన ఆమె మొదట మహీరా (2019)లో నటించింది. కన్నడ చిత్రం 'గరుడ గమన వృషభ వాహనం'లో ఆమె పాడిన 'సోజుగడా సూజు మల్లిగే' అనే పాట ఇంటర్నెట్‌లో అత్యధిక వీక్షణలతో సంచలనం సృష్టించింది. దీనికి గాను 2022లో ఆమెకు సైమా పురస్కారం కూడా దక్కింది. చైత్ర ప్రస్తుతం ఉత్తరకాండ, మై లార్డ్, స్ట్రాబెర్రీ, మర్ణామి వంటి చిత్రాల్లో నటిస్తోంది. సప్త సాగరాలు దాటి: సైడ్ బి సినిమాలో చైత్ర ఒక వేశ్యగా నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.


