
బిగ్‌బాస్ 9 తెలుగులో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆయేషా దుమ్మురేపుతుంది. కేరళకు చెందిన ఆమె అసలు పేరు ఆయేషా జీనత్.. అయితే, కోలీవుడ్‌లోనే ఆమెకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. 2019లో ఆమె నటించిన సత్య సీరియల్ తమిళ్‌లో పాపులర్ అయింది. దీంతో ఏకంగా సత్య-2 కూడా రన్ చేశారు. అలా తమిళ్ బిగ్‌బాస్-6లో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ సుమారు 60రోజుల పాటు కొనసాగింది. తెలుగులో స్టార్‌మా సీరియల్స్ సావిత్రమ్మ గారి అబ్బాయి, ఊర్వశివో రాక్షసివో వంటి ప్రాజెక్ట్‌లతో మెప్పించింది. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్‌లో కూడా తన స్టైల్లోనే పవర్‌ఫుల్‌గా టాలెంట్ చూపుతుంది.
రెండుసార్లు నిశ్చితార్థం
ఆయేషా రెండుసార్లు నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహ జీవితంలో అడుగుపెట్టలేదు. మొదట హరన్ రెడ్డిని ప్రేమించింది. అతను ఫ్యాషన్ ఫోటోగ్రాపర్‌గా సినిమా పరిశ్రమలోనే కొనసాగాడు. కొన్ని ప్రాజెక్ట్‌లకు వారిద్దరూ కలిసి కూడా పనిచేశారు. అయితే, అతను తనను ప్రేమిస్తూనే మరో అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న ఆయేషా బ్రేకప్ చెప్పింది. ఇదే విషయాన్ని తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె పంచుకుంది. అయితే, 2023లో యోగేష్ (యోగి)తో డేటింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. కానీ, ఎంగేజ్‌మెంట్‌తోనే అతనికి కూడా ఆమె గుడ్‌బై చెప్పేసింది. నిజాయితీ లేని ప్రేమ తనకు అవసరం లేదని ఆమె పలుమార్లు చెప్పుతూ వచ్చింది. కెరీర్ మీద మాత్రమే తన ఫోకస్ ఉంటుందని, ఈ ప్రేమలు తనకు పడవని ఒక క్లారిటీ వచ్చినట్లు పలు ఇంటర్వ్యూలో తెలిపింది.
మోసం చేసిందని ఆయేషాపై కామెంట్ చేసిన మొదటి ప్రేమికుడు
ఆయేషా హీరోయిన్‌గా మూడు సినిమాల్లో కూడా నటించింది. తమిళ్ బిగ్‌బాస్‌లో చాలా వివాదాస్పద కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. తోటి కంటెస్టెంట్స్‌ను ఆవేశంతో దూషించడం వల్ల తను చెడ్డపేరు మూటకట్టుంది. దీంతో హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో వారికి క్షమాపణలు కూడా చెప్పడం విశేషం. ఒకసారి హౌస్ట్‌గా ఉన్న కమల్ హాసన్‌నే ఎదిరించి వైరల్ అయింది. అయితే, ఆమె తమిళ్ బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఆమె మాజీ ప్రియుడు దేవ్ సంచలన ఆరోపణలు చేశాడు.
ఆయేషాకు ఇండస్ట్రీలో అవకాశాలు రాగానే తనను వదిలేసిందని కామెంట్ చేశాడు. పెళ్లి చేసుకుందామని ఇంటికి వెళ్లి అడిగితే అందరూ కలిసి తనను అవమానించడమే కాకుండా.. కొట్టి పంపించారన్నాడు. తనతో బంధం తెంచేసుకుని మరో ఇద్దరితో ఆమె ప్రేమాయణం నడిపిందని చెప్పాడు. అయితే, అతను చేసిన ఆరోపణల గురించి ఆయేషా మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఫైనల్‌గా ఆయేషా జీవితంలో మూడు ప్రేమకథలు బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.