
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిష్ వెంకట్ చికిత్సకు ఆర్థికసాయం అందించారు.
తెలుగులో పలు చిత్రాల్లో ఫిష్ వెంకట్ నటించారు. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. కాగా.. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్ కాగా.. ముషీరాబాద్ మార్కెట్లో చేపలు వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్గా తెచ్చుకున్నారు. తెలుగులో 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించారు.