శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం పరాశక్తి. సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆకాశ్ భాస్కర్ భారీఎత్తున నిర్మించారు. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో పరాశక్తిపై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. సినిమా టైటిల్ కూడా ఇందుకు ఒక కారణం. దివంగత నటుడు శివాజీగణేశన్ కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం పేరు పరాశక్తి. అదే పేరుతో మళ్లీ ఇన్నాళ్లకు శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2026 జనవరిలో సంక్రాంతి సందర్బంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇదివరకే ప్రకటించారు. మంగళవారం నాడు ఈ సినిమా నుంచి సింగారాల సీతాకోక.. పాట ప్రోమోను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్, శ్రీలీల స్టెప్పులేశారు. ఫుల్ సాంగ్ నేడు (నవంబర్ 6న) విడుదల కానుంది.


