తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కారు ప్రమాదానికి గురైంది. చెన్నైలోని కైలాశ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్ సురక్షితంగా బయటపడగా.. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా.. ప్రస్తుతం శివ కార్తికేయన్ పరాశక్తి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా కనిపించనుంది. ఇందులో రవి మోహన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీకి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Actor #ShivaKarthikeyan narrowly escapes danger as another car hits his vehicle from behind in Kailash, Chennai. Thankfully, he walked away safe.
Follow 👉 @FilmyBowlTamilpic.twitter.com/K6yaUm1BhG— FilmyBowl Tamil (@FilmyBowlTamil) December 20, 2025


