కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్‌ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.
ఒరిజినల్ సాంగ్ రిలీజ్
దీంతో అది టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్‌లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు.
రాజశేఖర్‌తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?
చండీగఢ్‌కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్‌సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది.
చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా?


