breaking news
Gurleen Chopra
-
ట్రెండింగ్‌లోకి 'ఇదేమిటయ్యా మాయా..'. ఆ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కె ర్యాంప్ మూవీ (K Ramp Movie) హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ మూవీ ప్రారంభంలో హీరో.. ఇదేమిటమ్మా మాయా మాయా.. అంటూ రాజశేఖర్ సాంగ్‌ను రీక్రియేట్ చేశాడు. మాస్ స్టెప్పులతో ప్రారంభంలోనే కావాల్సినంత ఊపు తెప్పించాడు. సినిమాకు మంచి ఎనర్జీనిచ్చిన ఈ సాంగ్ వీడియోను గురువారం నాడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఒరిజినల్ సాంగ్ రిలీజ్దీంతో అది టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇదేమిటమ్మా మాయా... ఒరిజినల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాట ఆయుధం సినిమాలోనిది. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా చిన్ని చరణ్ లిరిక్స్ రాశారు. కుమార్ సాను, నిష్మా ఆలపించారు. ఈ సాంగ్‌లో రాజశేఖర్, గుర్లీన్ చోప్రా (Gurleen Chopra) జంటగా స్టెప్పులేశారు. ఎన్.శంకర్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌తో స్టెప్పేసిన బ్యూటీ ఎవరు?చండీగఢ్‌కు చెందిన గుర్లీన్ చోప్రా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. ఒక పెళ్లాం ముద్దు- రెండో పెళ్లాం వద్దు, నేను సైతం, ఖాకీ, పాండవులు పాండవులు తుమ్మెద, శివ కేశవ్ చిత్రాలు చేసింది. హిందీ, కన్నడ, తమిళ, పంజాబి, మరాఠి భాషల్లోనూ యాక్ట్ చేసింది. 2020 తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంది. నటుడు డేవిందర్ రాంధ్వాను పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కౌన్సెలింగ్ విత్ జీసీ పేరిట ఓ వెబ్సైట్ నడిపిస్తోంది. ఇందులో ఆమె పోషకాహార నిపుణురాలిగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by ACTRESS GURLEEN CHOPRA (@igurleenchopra)చదవండి: కవలలకు జన్మనివ్వనున్న ఉపాసన.. చిరంజీవి ఆశ నెరవేరేనా? -
డేర్ డెవిల్
నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్, కత్తి మహేశ్, అమిత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్’. ఆర్.ఎ. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్ మాస్టర్ కృష్ణంరాజు నేతృత్వంలో గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ తదితరులపై పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ–‘‘మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది. నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్ దేవ్ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. మే చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తొలిసారిగా ఓ డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా’’ అన్నారు గుర్లిన్ చోప్రా. ‘‘అదుర్స్, కృష్ణ’ వంటి హిట్ చిత్రాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తెలుగులో ‘రౌడీ పోలీస్’ చేస్తున్నా’’ అన్నారు ముకుల్ దేవ్. కత్తి మహేశ్, కెమెరామెన్ ముజీర్ పాల్గొన్నారు. -
‘శివకేశవ్’ చూసి శ్రీహరి చాలా ఆనందపడ్డారు
‘‘శ్రీహరి లేని లోటు తీర్చలేనిది. ఆయన చేతుల మీదగా జరగాల్సిన వేడుక ఇది. అలాంటిది ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సి రావడం చాలా బాధగా ఉంది’’ అన్నారు బానూరు నాగరాజు (జడ్చర్ల). ఆర్వీ సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో శ్రీహరి, జయంత్, గుర్లిన్‌చోప్రా, సంజన కాంబినేషన్లో నాగరాజు నిర్మించిన చిత్రం ‘శివకేశవ్’. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్రం డబుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘శ్రీహరి నటించిన పోలీస్, సాంబ, భద్రాచలం తదితర చిత్రాల కోవలో ఈ చిత్రం నిలుస్తుంది. ఈ చిత్రం ఫస్ట్ కాపీ చూసి, ఆయన చాలా ఆనందపడ్డారు. అలాంటి శ్రీహరి హఠాన్మరణం కలచివేస్తోంది. ఆయన సహకారం మరవలేనిది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. శ్రీహరి కాంబినేషన్లో నటించడం మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యిందని జయంత్ తెలిపారు. ఈ వేడుకలో కృష్ణభగవాన్, విజయ్‌కుమార్, వేణు-పాల్, చిన్నం పాండు, సంధ్యాజనక్, మధుమణి తదితర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సముద్ర యూనిట్ సభ్యులకు డబుల్ ప్లాటినమ్ డిస్క్‌లను ప్రదానం చేశారు.


