డేర్‌ డెవిల్‌ | Nikesha Patel to make Tollywood comeback with Rowdy Police | Sakshi
Sakshi News home page

డేర్‌ డెవిల్‌

Apr 6 2018 12:16 AM | Updated on Apr 6 2018 12:16 AM

Nikesha Patel to make Tollywood comeback with Rowdy Police - Sakshi

నికిషా పటేల్, గుర్లిన్‌ చోప్రా, ముకుల్‌ దేవ్, కత్తి మహేశ్, అమిత్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రౌడీ పోలీస్‌’. ఆర్‌.ఎ. ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫైట్‌ మాస్టర్‌ కృష్ణంరాజు నేతృత్వంలో గుర్లిన్‌ చోప్రా, ముకుల్‌ దేవ్‌ తదితరులపై పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత జాని మాట్లాడుతూ–‘‘మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.

నికిషా పటేల్, గుర్లిన్‌ చోప్రా, ముకుల్‌ దేవ్‌ వంటి టాలెంటెడ్‌ ఆర్టిస్టులతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తొలిసారిగా ఓ డేర్‌ డెవిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నా’’ అన్నారు గుర్లిన్‌ చోప్రా. ‘‘అదుర్స్, కృష్ణ’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకొని తెలుగులో ‘రౌడీ పోలీస్‌’ చేస్తున్నా’’ అన్నారు ముకుల్‌ దేవ్‌. కత్తి మహేశ్, కెమెరామెన్‌ ముజీర్‌ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement