హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది పొంగల్‌కు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయం అందుకున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదారి గట్టు మీద రామచిలకవే.. పాట ఎంత వైరలయిందో ఇప్పుడు చిరంజీవి మూవీ (Mana Shankaravaraprasad Garu Movie)లోని మీసాల పిల్ల కూడా అంతే వైరలవుతోంది.
36 మిలియన్ల వ్యూస్
(Meesaala Pilla Song) యూట్యూబ్‌లో టాప్‌లో దూసుకుపోతోంది. 13 రోజులుగా ఫస్ట్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు 36 మిలియన్ల వ్యూస్ అందుకుంది. ఈ సాంగ్‌లో చిరు వేసే స్టెప్పులు సింపుల్‌గా కనిపిస్తూనే చాలా స్టైలిష్‌గా ఉంటాయి. లిరికల్ సాంగ్‌కే ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తే ఇక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో!
సినిమా
భీమ్స్ సంగీతం అందించిన మీసాల పిల్ల పాటను ఉదిత్ నారాయణ్, శ్వేత మోహన్ ఆలపించారు. భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశాడు. పోలకి మాస్టర్ కొరియోగ్రాఫీ చేశాడు. మన శంకరవరప్రసాద్‌గారు సినిమా విషయానికి వస్తే.. చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
The unanimous chartbuster continues to be the audience’s favourite song of the season ❤️🔥#MeesaalaPilla Trending #1 on YouTube for 13 days with 36MILLION + views 🔥🔥🔥
-- https://t.co/4dgILT40kG #ManaShankaraVaraPrasadGaru Sankranthi 2026 RELEASE
Megastar @KChiruTweets… pic.twitter.com/8sbxhs7BrY— Shine Screens (@Shine_Screens) October 27, 2025
చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?


