రామ్ పోతినేని, భాగ్యశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ 'ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra King Taluka Trailer). ఈ సినిమాకు మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించారు. ఓ సినిమా హీరో అభిమాని జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా ఇవాళ ఆంధ్ర కింగ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కర్నూలులోని ఔట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డ్రోన్స్ విజువల్స్ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇలా చేయడం తొలిసారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది.


