
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్ చేశారు.
సూపర్ డూపర్ హిట్టు సాంగ్
అదే సూపర్ డూపర్ హిట్టు సాంగ్! ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్టని లిరిక్స్‌లోనే చెప్తున్నారు. రోహిణి, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
చదవండి: నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది?