breaking news
Mass Jathara Movie
-
'తు మేరా లవర్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)కు గడ్డుకాలం నడుస్తోంది. ఏ సినిమా చేసినా వైఫల్యమే ఎదురవుతోంది. తనకు మంచి హిట్టు పడి చాలాకలమే అవుతోంది. ఇటీవల ఆయన మాస్ జాతరతో ప్రేక్షకుల్ని పలకరించాడు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయకుండానే కనుమరుగైపోయింది.వీడియో సాంగ్ రిలీజ్అయితే ఇందులోని కొన్ని పాటలు మాత్రం బాగానే క్లిక్కయ్యాయి. అందులో ఒకటి 'తు మేరా లవర్' సాంగ్. ఇడియట్ సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..' పాటను రీమిక్స్ చేసి ఈ సాంగ్ తెరకెక్కించారు. సోమవారం (నవంబర్ 17న) తు మేరా లవర్ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ మాస్ స్టెప్పులు మీరూ చూసేయండి.. చదవండి: సినిమా ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ -
అక్టోబర్ బాక్సాఫీస్ వసూళ్లు.. వంద కోట్లకు దూరంగా టాలీవుడ్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతికి ఉన్న క్రేజే వేరు. ఈ పండుగకు మూవీ రిలీజ్ చేసేందుకు ఏడాది ముందుగానే ప్లాన్ చేస్తుంటారు. ఈ పండుగకు ఉన్న మార్కెట్ అలాంటిది. ఆ తర్వాత సినిమా వాళ్లకు బాగా కలిసొచ్చే పండుగలు దసరా, దీపావళి. ఈ రెండు ఫెస్టివల్స్‌కు సైతం పెద్దఎత్తున చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. అలాగే ఈ ఏడాది కూడా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే ఈ పండుగల బాక్సాఫీస్ బరిలో హిట్‌గా నిలిచిందెవరు? అభిమానులను నిరాశపరిచిందెవరు? మీరు ఓ లుక్కేయండి.ఈ ఏడాది అక్టోబర్‌లో టాలీవుడ్ నుంచి దసరాకు పెద్ద చిత్రాలేవీ రిలీజ్ కాలేదు. దీనికి కారణం బాక్సాఫీస్ బరిలో కాంతార చాప్టర్-1 నిలవడమే. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రావడంతో తెలుగు చిత్రాలు రిలీజ్ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత శశివదనే, మిత్రమండలి, ఎర్రచీర, కానిస్టేబుల్ లాంటి చిన్న సినిమాలు అలా వచ్చి.. ఇలా వెళ్లాయి. వీటిపై పెద్దగా బజ్ లేకపోవడంతో వారంలోపే బాక్సాఫీస్ వద్ద కనుమరుగయ్యాయి.ఇక రెండో వారంలో 'అరి', 'కానిస్టేబుల్', 'మటన్ షాప్ వంటి కొన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కానిస్టేబుల్, మటన్ షాప్ అసలు ఊసే లేదు. కొద్దొ గొప్పో 'అరి' మూవీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. కేవలం మౌత్ టాక్‌తోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. అరిషడ్వర్గాలుఅనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దివాళీ విషయానికొస్తే వరుసగా మూడు తెలుగు చిత్రాలు రిలీజ్ చేశారు. అందులో కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటితో పాటు కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ కూడా పోటీపడింది. వీటిలో కె-ర్యాంప్ ఫర్వాలేదనిపించగా.. తెలుసు కదా మూవీతో సిద్ధు మరోసారి నిరాశపరిచాడు. ఈ రెండు తెలుగు సినిమాలు దీవాళీ బాక్సాఫీస్ వద్ద ఆశించినస్థాయిలో రాణించలేకపోయాయి. ఇక డ్రాగన్ హీరో డ్యూడ్ కూడా దీపావళికి వందకోట్ల మార్క్ అందుకుంది.ఈ అక్టోబర్ నెల చివర్లో రాజమౌళి బాహుహలి ది ఎపిక్, రవితేజ మాస్ జాతర బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. రెండు భాగాలను కలిపి దర్శకధీరుడు ప్రేక్షకులను సరికొత్త థ్రిల్ అందించారు. అయితే భారీ అంచనాలు పెట్టుకున్న మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు మాత్రం మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. మాస్ హీరోగా పేరున్న రవితేజ అదే పంథాలో రావడం.. కొత్తదనం లేకపోవడంతో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఓవరాల్‌గా చూస్తే ఈ దసరా, దీపావళి తెలుగు సినిమాలకు కలిసి రాలేదనే చెప్పాలి. డబ్బింగ్ సినిమాలైనా కాంతార చాప్టర్-1, డ్యూడ్ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటగా.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం వందకోట్ల మార్క్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఈ లెక్కన అక్టోబర్ మన తెలుగు సినిమాలకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక టాలీవుడ్ సినీ ప్రియుల ఆశలన్నీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలపైనే. పొంగల్ బాక్సాఫీస్ మూవీస్ మనశంకరవరప్రసాద్గారు, ది రాజాసాబ్, అనగనగ ఒక రాజు వంద కోట్ల మార్క్ చేరుకుంటాయోమో వేచి చూడాల్సిందే. -
రవితేజ.. తిరిగి చూసుకోవాల్సిన టైమొచ్చింది!
రవితేజ.. టాలీవుడ్లో ఈ పేరుకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్లోకి ఇండస్ట్రీలోకి వచ్చి.. చిన్నచితకా గుర్తింపు లేని పాత్రలు చేస్తూ ఆపై నటుడిగా, తర్వాత కాలంలో స్టార్ హీరో అయిన ఇతడు.. ఎందరో వర్ధమాన నటీనటులకు ఆదర్శం. కానీ ప్రస్తుతానికొస్తే రవితేజ సినిమాలపై బోలెడన్ని విమర్శలు. తాజాగా 'మాస్ జాతర'తో మరో ఫెయిల్యూర్. ఇదంతా చూస్తుంటే అసలు రవితేజ ఎందుకిలా చేస్తున్నాడు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనేది సగటు ప్రేక్షకుడి సందేహం.(ఇదీ చదవండి: 'బాహుబలి' లేకపోతే ఆ సినిమాలు తీసేవాడిని కాదు: మణిరత్నం)గత కొన్నేళ్లుగా రవితేజ సరైన సినిమాలు చేయట్లేదు. ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం. ఈగల్, టైగర్ నాగేశ్వరరావు లాంటి ఒకటి రెండు ప్రయోగాలు చేసినప్పటికీ వాటిలో యూనిక్ పాయింట్‌ని కమర్షియల్ అంశాలు డామినేట్ చేశాయి. దీంతో ఇవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్స్‌గానే మిగిలిపోయాయి.2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్' సినిమా హిట్. దీని తర్వాత 'టచ్ చేసి చూడు', నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, క్రాక్, ఖిలాడీ, రామారావ్ ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర.. ఇలా 13 చిత్రాలొచ్చాయి. వీటిలో క్రాక్, ధమాకా మాత్రమే హిట్. 'ధమాకా'పై విమర్శలున్నప్పటికీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి హిట్టే.(ఇదీ చదవండి: ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?)అసలు ఇన్ని ఫ్లాప్స్ వస్తున్నా సరే రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అది కూడా స్టార్ హీరోలతో పోలిస్తే వేగంగా. అయితే వేగంగా చేయడం కంటే కంటెంట్ పరంగా ఏది చేస్తున్నాం? ఎలాంటిది చేస్తున్నాం? ప్రేక్షకులకు ఇది నచ్చుతుందా? లాంటి అంశాలు రవితేజ ఓసారి ఆలోచించుకుంటే మంచిదేమో!రవితేజ అనగానే చాలామంది పాత సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు గానీ కొత్త చిత్రాల్లో ఒక్క దాని గురించి మాట్లాడట్లేదు. రవితేజ వైపు నుంచి యాక్టింగ్ పరంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. కానీ ఆయనకు తగ్గ సినిమాలే ఎంచుకోవట్లేదు. ఈ విషయంలో రవితేజ కూడా పొరపాటు చేస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు స్టార్ దర్శకుల్ని రవితేజ వద్దనుకుంటున్నారా? లేదా వాళ్లే రవితేజ దగ్గరకు రావట్లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతే రవితేజ కూడా సగటు హీరోగానే మిగిలిపోతారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా ఓసారి వెనక్కి తిరిగి చూసుకుని ట్రెండ్‌కి దగ్గ దర్శకులు, ట్రెండ్‌కి తగ్గ స్టోరీస్ చేస్తే ఒకటి కాకపోయినా మరొకటి అయినా హిట్ అయి ప్రేక్షకులకు నచ్చే అవకాశముంది. చూడాలి మరి రవితేజ ఏం చేస్తారో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
ఇండస్ట్రీ వదిలేస్తా.. రాజేంద్రప్రసాద్ ఇప్పుడేమంటారు?
సినిమా సెలబ్రిటీల్లో కొందరు మైక్ అందుకోగానే నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ సినిమాల గురించి ఆహా ఓహో అనే రేంజులో పొగిడేస్తుంటారు. అయితే ఇలా వర్కౌట్ అయిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పొచ్చు. రీసెంట్గా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇలానే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయారు.అసలు విషయానికొస్తే 'మాస్ జాతర' ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. 'ఈ సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుంది. చూసి షాక్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాను' అని చెప్పారు. గత శుక్రవారం సాయంత్రం షోలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు వీకండ్ పూర్తయిన తర్వాత ఫలితం తేలిపోయింది. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది! దీంతో పలువురు నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌ని మళ్లీ గుర్తుచేస్తున్నారు. మాట మీద నిలబడి ఇండస్ట్రీని వదిలేస్తారా అని కామెంట్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: శివగామిని డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇలా మార్చేశారేంటి!)ఇప్పుడే కాదు గతంలోనూ ఒకరిద్దరు యంగ్ హీరోలు ఇలానే తమ సినిమా రిలీజులకు ముందు.. హిట్ అవ్వకపోతే పేరు మార్చుకుంటూ అది ఇది అని నోరుజారారు. తీరా మూవీ రిజల్ట్ తేడా కొట్టేసిన తర్వాత ఏదో కవర్ చేశారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కూడా అలాంటి కవర్ డ్రైవ్స్ ఏమైనా వేస్తారా? లేదంటే సరదాకే అలా అన్నాను అని అంటారా అనేది చూడాలి?గతంలోనూ పలు ఈవెంట్స్ సందర్భంగా అలీ, రోజా, డేవిడ్ వార్నర్‌పై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడిచ్చిన స్టేట్మెంట్కి సినిమాకు వచ్చిన ఫలితానికి ఏమని స్పందిస్తారో చూడాలి? మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మాట్లాడిన హీరో రవితేజ కూడా.. గత కొన్ని మూవీస్‌తో చిరాకు పెట్టాను, ఈసారి హిట్ కొట్టబోతున్నాం అని అన్నారు. తీరా చూస్తే 'మాస్ జాతర'.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. చూస్తుంటే సెలబ్రిటీలు.. స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో ఆచితూచి మాట్లాడటం అవసరం అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 17 మూవీస్.. అవి మిస్ అవ్వొద్దు) -
'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర'. నిన్న(అక్టోబరు 31) సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లలో రిలీజ్ చేశారు. నేటి(నవంబరు 1) నుంచి రెగ్యులర్ షోలు వేస్తున్నారు. టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు మూవీ గురించి సగటు సినీ ప్రేక్షకుడు పెదవి విరిచాడు. ఇప్పుడు థియేటర్లలో సినిమా చూసొచ్చినోళ్లు కూడా అలానే అంటున్నారు. సగటు రవితేజ చిత్రంలా రొటీన్‌గానే ఉందని అంటున్నారు. మరోవైపు తొలిరోజు ఇంకా పూర్తికాకుండానే నిర్మాణ సంస్థ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేసింది.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)తొలిరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ప్రీమియర్లు పడ్డాయి. వీటికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. అలాంటిది ప్రీమియర్లలో ఏకంగా రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచలేదు. ప్రీమియర్లు బాగానే వేసినప్పటికీ రూ.5 కోట్లు వచ్చాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.'మాస్ జాతర' విషయానికొస్తే.. లక్ష్మణ్ (రవితేజ) నిజాయితీ గల రైల్వే పోలీస్. వరంగల్‌లో పనిచేసే టైంలో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అల్లూరి జిలాల్లోని అడవివరం రైల్వే స్టేషన్‌కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు. గంజాయిని కోల్‌కతాకు స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. లక్ష్మణ్ ఈ ఊరికి రావడంతోనే శివుడితో గొడవ పెట్టుకుంటాడు. రాజకీయంగా అండదండలు ఉన్న శివుడిని.. ఓ సాధారణ రైల్వే పోలీస్ ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో తులసి (శ్రీలీల), హనుమాన్ (రాజేంద్రప్రసాద్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తప్పంతా నాదే: ఛత్రపతి శేఖర్) -
‘మాస్ జాతర’ సినిమా రిలీజ్..ట్రెండింగ్ లో శ్రీలీల (ఫొటోలు)
-
రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడా..!
-
Mass Jathara: ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ
‘ధమాకా’ తర్వాత రవితేజ ఖాతాలో సరైన హిట్టే పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. ఇద్దరి నుంచి వరుస సినిమాలు వస్తున్నా.. ‘ధమాకా’ స్థాయి హిట్ మాత్రం రాలేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు జోడీగా ‘మాస్ జాతర’(Mass Jathara Movie Review In Telugu)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ధమాకా’ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మాస్ జాతర’(Mass Jathara Review )పై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్ జాతర’ అందుకుందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..లక్ష్మణ్ భేరి(రవితేజ) పవర్ఫుల్ రైల్వే పోలీసు అధికారి. రైల్వే స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా చూసుకునే బాధ్యతే తనది. కానీ దాంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరిగినా.. ఆయన ఎంటర్ అవుతుంటారు. ఓ కేసు విషయంలో మంత్రి కొడుకుని కొట్టి.. వరంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ గ్రామం మొత్తం శివుడు(నవీన్ చంద్ర) కంట్రోల్లో ఉంటుంది. అక్కడి రైతులతో గంజాయి పండించి..కోల్‌కత్తాకు సరఫరా చేయడం ఆయన పని. లక్ష్మణ్ భేరీ వచ్చీరావడంతోనే శివుడు చేసే స్మగ్లింగ్ పనికి ఎదురుతిరుగుతాడు. కానీ ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు మొత్తం శివుడికి సపోర్ట్‌గా నిలుస్తారు. కేవలం రైల్వే స్టేషన్ పరిధిమేర మాత్రమే అధికారాలు ఉన్న లక్ష్మణ్..శివుడి దందాని ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాస్ జాతర’ చూడాల్సిందే. ఎలా ఉందంటే...కమర్షియల్ సినిమాకు కొత్త కథ అవసరం లేదు. హీరోకి భారీ ఎలివేషన్స్, బలమైన విలన్.. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు. ఇవన్నీ ‘మాస్ జాతర’లో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు భాను భోగవరపు పూర్తిగా సఫలం కాలేదు. కథ-కథనం పక్కకి పెట్టి..కేవలం రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవి కొంతవరకు ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేసినా.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌గానే అనిపిస్తాయి. ఎంత కమర్షియల్ సినిమా అయినా కొన్ని చోట్ల అయినా వాస్తవికంగా అనిపించాలి. కానీ ఈ సినిమా అలా ఎక్కడ అనిపించదు. రవితేజ పాత్ర ఒకచోట తెలంగాణ యాస మాట్లాడితే..మరికొన్ని చోట్ల సాధారణ భాష మాట్లాడుతుంది. హీరోయిన్ పాత్ర శ్రీకాకుళం యాస మాట్లాడితే.. ఆమె తండ్రి మాత్రం సాధారణ భాషలో మాట్లాడతాడు. సీరియస్‌గా ఉండే హీరో..హీరోయిన్ కనిపించగానే కామెడీ చేస్తుంటాడు. లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. హీరో-తాతయ్యల మధ్య వచ్చే సన్నివేశాలు అటు పూర్తిగా నవ్వించ లేదు.. ఇటు ఎమోషనల్గానూ ఆకట్టుకోలేకపోయాయి. ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు. రవితేజ ఎంట్రీ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాసేపటికే కథనం రొటీన్‌గా సాగుతుంది. తాత(రాజేంద్రప్రసాద్) తో లక్ష్మణ్ భేరీ చేసే కామెడీ కొంతమేర నవ్విస్తుంది. ఇక హీరో అడవివరం వెళ్లిన తర్వాత కథనంలో మార్పు ఉంటుందని ఆశించినా...అక్కడ నిరాశే ఎదురవుతుంది. శివుడి ఎంట్రీ వరకు అద్బుతంగా చూపించి.. మళ్లీ రోటీన్‌గానే కథని ముందుకు నడిపించారు. క్లైమాక్స్.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు గుర్తుకు చేస్తుంది. కథ-కథనం రొటీన్‌గా ఉన్నా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. శివుడి మామ గ్యాంగ్‌తో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా అదిరిపోతుంది. కథ-కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే..‘మాస్ జాతర’ ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పోలీసు పాత్రలు ఆయన అవలీలగా చేసేస్తాడు. రైల్వే పోలీసు అధికారి లక్ష్మణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఫ్యాన్స్ కోరుకునేలా తెరపై కనిపించి అలరించాడు. ఇక శివుడి పాత్రలో నవీచంద్రం విలనిజం అద్భుతంగా పండించాడు. ఆయనలోని కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. తులసి పాత్రకు శ్రీలీల న్యాయం చేసింది. హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. Mass Jatara 2025 Movie Plus/Minus Points: సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నా..వాటి ప్లేస్మెంట్ సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రవితేజ మాస్ జాతర.. బాహుబలి దెబ్బతో వరస్ట్ రికార్డ్!
మాస్ మహారాజా తాజాగా మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తోన్న మాస్ జాతర ప్రీమియర్స్ ఈ రోజు నుంచే థియేటర్లలో సందడి చేయనున్నాయి. అక్టోబర్ 31 రిలీజవుతుందని ప్రకటించినా మేకర్స్.. బాహుబలి ది ఎపిక్ దెబ్బకు ప్రీమియర్స్‌కే పరిమితయ్యారు. దీంతో మాస్ జాతర ఫస్ట్ డే కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే రూ.61 లక్షలకే పరిమితమైంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కావడతో మాస్ జాతరకు ఆశించిన స్థాయిలో వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు.బాక్సాఫీస్ వద్ద బాహుబలి ది ఎపిక్ మూవీతో మాస్ జాతరకు గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రముఖ ట్రేడింగ్ వెబ్ సైట్ సాక్నిల్క్ ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటివరకు రూ. కోటి కూడా దాటలేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌తో శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం రూ.61 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రీమియర్స్ సాయంత్రం రిలీజ్ చేయడం.. తక్కువ షోలు వేయడం కూడా వసూళ్లపై ప్రభావం పడిందని చెప్పొచ్చు. ఉదయమే ప్రీమియర్స్‌తో పాటే మూవీ రిలీజ్ అయి ఉంటే వసూళ్ల పరంగా మాస్ జాతరకు కలిసొచ్చేది.ఓవరాల్‌గా చూస్తే శుక్రవారం ప్రీమియర్స్‌తో కలిపి రూ.2 నుంచి 3 కోట్ల వరకు వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. గతేడాది రిలీజైన రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ వసూళ్ల కంటే తక్కువే. ఈ సినిమా తొలి రోజే రూ.3.45 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోవడంతో రవితేజ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది. వీకెండ్లో మాస్ జాతర రిలీజ్ కావడం నిర్మాతకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన శని, ఆది వారాల్లోనైనా మాస్ జాతర వసూళ్లు పుంజుకునే అవకాశముంది. కాగా.. మాస్ జాతరలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. -
విన్నారా... విన్నారా?
ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్స్‌కు వస్తూనే ఉంటాయి. అలాగే హీరోలు కూడా ఎప్పటికప్పుడు తమ కొత్త ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటూనే ఉంటారు. అయితే ప్రజెంట్ తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న తెలుగు హీరోల సంఖ్య ఎక్కువగానే ఉంది. కథలు విన్నారనీ, ఇప్పటికే కొన్ని కొత్త సినిమాలకు సైన్ చేశారనీ కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి... ఏ హీరో ఏయే దర్శకుల కథ విన్నారు? అనే విషయాలపై మీరూ ఓ లుక్ వేయండి.జెట్ స్పీడ్‌తో... హీరో రవితేజ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘మాస్ జాతర’ సినిమా నేటి (అక్టోబరు 31) నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితమౌతోంది. అలాగే రవితేజ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ తర్వాత ‘మ్యాడ్’ చిత్రాల ఫేమ్ కల్యాణ్ శంకర్‌తో రవితేజ సినిమా చేయాల్సి ఉంది.ఈ చిత్రాలు ఇలా ఉండగానే... ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారని, కథ విన్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో తెరపైకి వచ్చింది. అలాగే రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కూడా రవితేజకు ఓ స్టోరీ లైన్ వినిపించారని, మరోసారి పూర్తి కథ విన్న తర్వాత ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే ఈ విషయాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.పవన్‌తో అనిల్ రావిపూడి? హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు అనిల్ రావిపూడిల కాంబినేషన్లో ఓ సినిమాకి సన్నాహాలు మొదలవుతున్నాయనే టాక్ తెరపైకి వచ్చింది. ‘దిల్’ రాజు, ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై ఓ క్లారిటీ రానుందని టాక్. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రోడక్షన్స్‌తో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని భోగట్టా.ఈ చిత్రానికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ‘రేసుగుర్రం, కిక్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సురేందర్ రెడ్డితో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి... సురేందర్ రెడ్డితో సినిమాను పూర్తి చేసిన తర్వాత పవన్ కల్యాణ్ తన కొత్త సినిమాల చిత్రీకరణలను సెట్స్‌కు తీసుకువెళ్తారా? లేదా అనే అంశంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా చేస్తున్నారు పవన్ కల్యాణ్. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది.తమిళ దర్శకుడితో...! ‘పెద్ది’ సినిమాతో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. ఇటీవల శ్రీలంకలో మొదలైన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసి గురువారం రామ్‌చరణ్ హైదరాబాద్ చేరుకున్నట్లుగా తెలిసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌తో రామ్‌చరణ్ సినిమా చేయాల్సి ఉంది.మరోవైపు తమిళ దర్శకుడు ‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్, హిందీ దర్శకుడు ‘కిల్’ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ చెప్పిన స్టోరీలను కూడా రామ్‌చరణ్ విన్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అలాగే దర్శకులు త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా రామ్‌చరణ్ సినిమాలు చేస్తారనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి... నెల్సన్‌తో రామ్‌చరణ్ సినిమా ఎప్పుడు సెట్స్‌కు వెళ్తుంది? అసలు... ఈ తమిళ దర్శకుడితో రామ్‌చరణ్ సినిమా ఉంటుందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది.నాగచైతన్య 25 నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఓ మిథికల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇది నాగచైతన్య కెరీర్‌లోని 24వ సినిమా. కాగా, నాగచైతన్య కెరీర్‌లోని 25వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలై పోయాయన్న టాక్ వినిపిస్తోంది. దర్శకులు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ చెప్పిన కథలను హీరో నాగచైతన్య విన్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... నాగచైతన్య కెరీర్‌లోని ఈ 25వ సినిమాకు ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరు ఖరారు అవుతారా? లేక మరో దర్శకుడి పేరు ఏమైనా తెరపైకి వస్తుందా? అనేది వేచి చూడాలి.గ్రీన్ సిగ్నల్ గోపీచంద్‌తో ‘విశ్వం’ సినిమా చేసి, మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చారు దర్శకుడు శ్రీను వైట్ల. ఈ సినిమా తర్వాత తనదైన శైలిలో మరో ఎంటర్టైనింగ్ స్టోరీని శ్రీను వైట్ల సిద్ధం చేసుకున్నారని, ఈ కథను ఇటీవల శర్వానంద్‌కు వినిపించగా, ఈ హీరో ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ప్రస్తుతం ‘బైకర్’, ‘భోగి’ సినిమాల చిత్రీకరణలతో శర్వానంద్ బిజీగా ఉన్నారు. అలాగే ఆల్రెడీ శర్వానంద్ హీరోగా నటించిన ‘నారి నారి నడుమ మురారి’ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇలా వచ్చే ఏడాది మూడు సినిమాలతో శర్వానంద్ సందడి చేయనున్నారు.స్పోర్ట్స్ డ్రామా ‘రౌడీ జనార్ధన’ (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రం కోసం హీరోయిన్ కీర్తీ సురేశ్, విజయ్ దేవరకొండలపై మహారాష్ట్ర సరిహద్దుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ చిత్రదర్శకుడు రవికిరణ్ కోలా. అయితే ఈ సినిమా తర్వాత తనకు ‘టాక్సీవాలా’తో సూపర్‌హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్‌తో ఓ పీరియాడికల్ వార్ డ్రామా కమిటయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.అయితే రీసెంట్గా దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ఓ స్పోర్ట్స్ డ్రామా స్టోరీని విజయ్ దేవరకొండకు వినిపించారని, ఈ కథ పట్ల విజయ్ కూడా సుముఖంగా ఉన్నారని, యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. మరి... ‘రౌడీ జనార్ధన’ తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ సంకృత్యాన్ సినిమాను స్టార్ట్ చేస్తారా? లేక విక్రమ్ కె. కుమార్ సినిమాను మొదలు పెడతారా? అనే అంశాలపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు రాహుల్ సంకృత్యాన్, విక్రమ్ కె. కుమార్ల సినిమాలను విజయ్ ఒకేసారి సెట్స్‌కు తీసుకువెళ్లే అవకాశాలూ లేక పోలేదు.ద్విపాత్రాభినయం ‘తమ్ముడు’ సినిమా తర్వాత నితిన్ కొత్త చిత్రంపై ఇంకా సరైన స్పష్టత లేదు. దర్శకుడు శ్రీను వైట్ల, ‘బలగం’ ఫేమ్ దర్శకుడు వేణు యెల్దండి చెప్పిన కథలను నితిన్ విన్నారన్న వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమాలేవీ ఫైనలైజ్ కాలేదు. కాగా, ఇటీవల దర్శకుడు వీఐ ఆనంద్ ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేసుకుని, నితిన్‌కు వినిపించారట. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త విభిన్నంగా ఉండటంతో ఈ కథ నచ్చి, నితిన్ ఈ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రంలో నితిన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం.గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ‘ఫంకీ’ సినిమాతో విశ్వక్ సేన్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ డిసెంబరు చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా తర్వాత తరుణ్ భాస్కర్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా సీక్వెల్‌ను చేయనున్నారట. అలాగే శర్వానంద్‌తో ‘శ్రీకారం’ సినిమా తీసి, ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిశోర్ ఓ కథను సిద్ధం చేసి, విశ్వక్ సేన్‌కు వినిపించారని, ఈ సినిమాకు విశ్వక్ దాదాపు ఓకే చెప్పారని తెలిసింది. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్ శిష్యుడితో...! ఇటీవలే ‘కె–ర్యాంప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ ‘చెన్నై లవ్‌స్టోరీ’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఇటీవల మరో రెండు మూడు కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ చిత్రాల్లో ఒకటి సుకుమార్ శిష్యుడు వీర అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.జటాయులో..? ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘జటాయు’ అనే టైటిల్‌తో ఓ పవర్ఫుల్ స్టోరీని ఎప్పుడో సిద్ధం చేశారు. కానీ ఈ కథతో ఈ చిత్రం ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ఇందులో విజయ్ దేవరకొండ వంటి వారు హీరోలుగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఈ ‘జటాయు’ స్టోరీని ప్రముఖ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా విన్నారని, ఈ యువ హీరోతో ఈ’ సినిమా ఆల్మోస్ట్ ఖరారై పోయిందని, ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విషయాలపై అధికారిక ప్రకటన రానుందట. ఇక రోషన్ ప్రజెంట్ ‘చాంపియన్’ అనే ఓ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. ఇలా తమ కొత్త సినిమాల కోసం కథలు వింటున్న హీరోలు మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
రవితేజ ఫ్యాన్స్ సర్ప్రైజ్లు చూడబోతున్నారు
నేను రవితేజకి అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని ‘మాస్ జాతర’ స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. రవితేజ ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అన్నారు దర్శకుడు భాను భోగవరపు. ఆయన దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ భాను భోగవరపు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ . ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ(Mass Jathara Movie) రాశాను. రవితేజ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.→ ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.→ 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు.→ ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.→ రవితేజ(Ravi Teja)కు ఇది 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజకి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.→ ఈ కథను రాసుకున్నప్పడే తులసి పాత్రకు శ్రీలీల(Sreeleea)ను తీసుకోవాలనుకున్నాను. , కథ వింటున్నప్పుడు హీరో, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల అని అనుకున్నారు. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి-విజయశాంతి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.→ దర్శకుడిగా నాకిది మొదటి సినిమా అయినప్పటికీ నిర్మాత నాగవంశీ ఎంతో మద్దతుగా నిలిచారు. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఆరున్నర కోట్లతో స్టేషన్ సెట్ వేయించారు. అలాగే జాతర ఎపిసోడ్ కోసం ఓ భారీ సెటప్ కూడా చేయించారు. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడ రాజీపడకుండా ఇంతటి సహకారం అందించడం మామూలు విషయం కాదు.→ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు. ఒకసారి కాలికి, మరోసారి చేతికి గాయాలయ్యాయి. అందుకే చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. అయినప్ప్పటికీ, రవితేజ సహకారం వల్లనే ఈ సినిమాని ఒత్తిడి లేకుండా పూర్తి చేయగలిగాను.→ రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను. -
'బాహుబలి', 'మాస్ జాతర' కోసం సైడ్ అయిపోయిన హీరో
ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్' రానుంది. రెండు భాగాల్ని కలిపి ఒకే మూవీగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి స్పెషల్ వీడియో ఒకటి చేశారు. దాన్ని తాజాగా రిలీజ్ కూడా చేశారు. ఇది రిలీజైన ఒకరోజు తర్వాత రవితేజ 'మాస్ జాతర'.. బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. ఇది కాకుండా ఓ తమిళ డబ్బింగ్ మూవీ కూడా రావాల్సింది. కానీ తెలుగు మూవీస్ కోసం సదరు తమిళ హీరో సైడ్ అయిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)తమిళ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'ఆర్యన్'. మానస చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె. దర్శకత్వం వహించారు. లెక్క ప్రకారం ఈ 31వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాలి. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్యన్‌ని విడుదల చేస్తున్నారు. కానీ బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర కారణంగా తెలుగులో ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న రిలీజ్ చేయనున్నారు. తమిళంలో మాత్రం యధావిధిగానే థియేటర్లలోకి రానుంది.'మా 'ఆర్యన్' ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక తేదీన రవితేజగారి 'మాస్ జాతర'తో పాటు 'బాహుబలి ది ఎపిక్' సినిమాలు తెలుగు ప్రేక్షకులను ముందుకు రావడం మరింత ప్రత్యేకమైనది. ఆ సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. 'ఆర్యన్' నవంబరు 7న తెలుగులోకి వస్తుంది. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్' అని విష్ణు విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు.(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్) View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) -
వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా
-
'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
కుటుంబంతో సహా చనిపోదామనుకున్నా.. ఆ హీరో వల్లే బతికా!
ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ నేడు ఎంతోమందికి ఛాన్సులిచ్చే స్థాయికి చేరుకున్నాడు. టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహించే మాస్ మహారాజ తన 75వ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. సామజవరగమన మూవీకి రచయితగా పని చేసిన భాను భోగవరపును డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాడు. తన జీవితం ముగిసిపోయిందనుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోను ధమాకాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మలిచాడు. అందుకే రవితేజ అంటే భీమ్స్కు ప్రాణం. అదే విషయాన్ని ఆయన మరోసారి వెల్లడించాడు.నా వెనక ఓ ధైర్యంరవితేజ ప్రధాన పాత్రలో నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. మంగళవారం (అక్టోబర్ 28న) ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా భీమ్స్ స్టేజీపై మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. ధమాకా తర్వాత నుంచి శివశంకర వరప్రసాద్ మూవీ చేసేవరకు నా వెనక ఓ ధైర్యం ఉంది. ఆయన గురించి మీ అందరికీ చెప్పాలి. ఎట్ల నేను సేద్దునో.. ఎట్ల పడి నేను సద్దునో.. అంటూ సెల్ఫోన్లో ఓ వీడియో తీసుకున్నాను. కుటుంబంతో కలిసి పైకి..అప్పుడు నా భార్యాపిల్లల్ని కూడా వీడియో తీశాను. నేనెందుకు వీడియో తీస్తున్నానో వాళ్లకు తెలియదు. ఇంటి అద్దె ఎలా కట్టాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఎలా బతకాలి? రేపు ఎలా గడుస్తుంది? అని బిక్కుబిక్కుమంటూ బతుకు వెళ్లదీస్తున్న రోజుల్లో నాకో ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఆఫీస్‌కు రమ్మని ఆహ్వానం వచ్చింది. నమ్మలేకపోయాను. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి, నాకు జీవితం లేదు. నా భార్యాపిల్లలతో కలిసి కట్టకట్టుకుని పైకి వెళ్లిపోదామనుకున్నాను. దేవుడిలా కాపాడాడుఅలాంటి సమయంలో దేవుడిలా ఒక మనిషి ప్రత్యక్షమయ్యాడు. ఆ శక్తి పేరు, వ్యక్తి పేరు, వ్యవస్థ పేరు రవితేజ సర్. మాటల్లో చెప్పాలంటే ప్రేమ.. పాటల్లో చెప్పాలంటే భక్తి. ఈరోజు నోట్లోకి ఐదువేళ్లు వెళ్తున్నాయంటే కారణం ఆయనే! అమ్మానాన్న, నీ కొడుకు సజీవంగా ఉండటానికి రవితేజ సర్ కారణం. అవకాశాల కోసం చాలామంది కథలు, కహానీలు చెప్తారనుకుంటారు. సిసిరోలియో ఎప్పుడూ కహానీలు చెప్పడు. ఉన్నదే చెప్తాడు. అందుకే సర్‌కు నేనంటే ఇష్టం, నాకు ఆయనంటే ఇష్టం (దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రిగారి వాయిస్‌ని ఏఐ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను (తూ మేరా లవర్ పాటని ఉద్దేశించి) అని భీమ్స్ సిసిరోలియో భావోద్వేగానికి లోనయ్యాడు.ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.comచదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
సినిమా చూసి షాకవ్వకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా: రాజేంద్రప్రసాద్
‘‘రవితేజ (Raviteja)గారికి నేను అభిమానిని. సూపర్ ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది మాస్‌మహారాజ రవితేజ. ఓ మామూలు మనిషిని స్క్రీన్‌పైకి తీసుకువచ్చి కింగ్ సైజ్‌లో సహజంగా చూపించే పాత్రలు చేస్తుంటారు. మన జీవితంలో కలలు నిజమౌతాయని ఆయన గుర్తు చేస్తుంటారు. ‘మాస్ జాతర’ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని హీరో సూర్య అన్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల హీరోయిన్గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటించారు. రవితేజపై సూర్య పొగడ్తల వర్షంభాను భోగవరపు దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సూర్య మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకులను నవ్వించడం కష్టమైన పని. ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను రవితేజ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ తరహా నైపుణ్యం తక్కువమందికి ఉంటుంది.ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాంఅమితాబ్ బచ్చన్, రజనీకాంత్ గార్లు మంచి కామిక్ టైమింగ్‌తో యాక్ట్ చేస్తుంటారు. రవితేజ గురించి కార్తీ, నేను, జ్యోతిక మాట్లాడుకుంటూ ఉంటాం. ‘విక్రమార్కుడు, కిక్’ సినిమాలు చూశాను. తమిళంలో కూడా రవితేజకి అభిమానులు ఉన్నారు. అక్టోబరు 31న థియేటర్స్‌లో రవితేజ జాతర’’అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ–‘‘సూర్యగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి వ్యక్తి. ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అభిమానులను నిరాశపర్చదు: రవితేజ‘మాస్ జాతర’ సినిమా చూశాను. హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో నవీన్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడనిపిస్తోంది. రాజేంద్రప్రసాద్‌గారితో నా కాంబినేషన్ సీన్స్ అలరిస్తాయి. ఇందులో మాస్ క్యారెక్టర్ చేశారు శ్రీలీల. భానురూపంలో మన ఇండస్ట్రీకి ఓ మంచి దర్శకుడు వస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలను, ముఖ్యంగా ఆర్ఆర్ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా నా అభిమానులను నిరాశపరచదు’’ అని చెప్పారు. శ్రీలీల మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో తులసి అనే మాస్ క్యారెక్టర్ చేశాను. ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా!: రాజేంద్రప్రసాద్రవితేజగారిని చూసి చాలా నేర్చుకున్నాను. సూర్యగారికి నేను పెద్ద అభిమానిని’’ అన్నారు. ‘‘మాస్ జాతర’ సినిమా ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు నిర్మాత నాగవంశీ. ‘‘అరవిందసమేత వీరరాఘవ’ చిత్రంలో నేను చేసిన బాల్ రెడ్డి పాత్ర తర్వాత ‘మాస్ జాతర’లో నేను చేసిన శివుడు క్యారెక్టర్‌ను ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారు’’ అని చెప్పారు నవీన్ చంద్ర. ‘‘రవితేజగారు నా కథ విని, సితార వంటి ఓ పెద్ద నిర్మాణ సంస్థలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు’’ అని భాను భోగవరపు పేర్కొన్నారు. ‘‘మాస్ జాతర’ చూసి ప్రేక్షకులు షాక్ అవ్వకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. నా క్యారెక్టర్ ఏంటో థియేటర్స్‌లో చూడండి’’ అని తెలిపారు రాజేంద్ర ప్రసాద్.చదవండి: ఆ సినిమా రిలీజయ్యాక ట్రోలింగ్.. తట్టుకోలేకపోయా! -
రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రవితేజ మూవీ నా తమ్ముడికి టర్నింగ్ పాయింట్'.. కోలీవుడ్ హీరో సూర్య
మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్‌తో మరోసారి ఆడియన్స్‌ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025 -
టాలీవుడ్‌పై 'మోంథా' ప్రభావం ఎంతవరకు?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై మోంథా తుపాన్ గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. తెలంగాణలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షాలు పడుతున్నాయి కానీ ఆంధ్రాలో మాత్రం ఎక్కడచూసినా సరే వానలు దంచికొడుతున్నాయి. తీరమంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరినీ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. అయితే మోంథా తుపాన్ ప్రభావం.. టాలీవుడ్‌పై ఎలా ఉండనుంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బోల్డ్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మోంథా తుపాన్.. ఈ రోజు(అక్టోబరు 28) రాత్రికి కాకినాడ దగ్గర తీరదాటనుంది. దీంతో బుధవారం కూడా కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్ష ప్రభావం గట్టిగానే ఉండగా.. కొన్ని ప్రాంతాలు నీటమునిగే అవకాశం కూడా లేకపోలేదు. శుక్రవారానికి గానీ తుపాన్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఈ శుక్రవారం 'బాహుబలి' రీ రిలీజ్‌తో పాటు 'మాస్ జాతర' సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిపై ఇప్పటికైతే ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఇప్పుడు తుపాన్ ప్రభావం వల్ల జనాలు ఈ వీకెండ్.. మూవీస్ చూసేందుకు ఆంధ్రాలో థియేటర్లకు వస్తారా అంటే సందేహమే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం రవితేజ, ప్రభాస్ చిత్రాలకు కలెక్షన్స్ పెద్దగా రాకపోవచ్చనే మాట వినిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి? (ఇదీ చదవండి: 'సౌందర్య'ను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ (వీడియో))'బాహుబలి' రీ రిలీజ్ విషయానికొస్తే.. గతంలో విడుదలైన రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు 'ఎపిక్' పేరుతో ఒకే పార్ట్‌గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. 3 గంటల 44 నిమిషాల నిడివితో ఇది ఉండనుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు. అయితే కొత్తగా ఓ సీన్ కూడా జోడిస్తున్నామని సినిమాటోగ్రాఫర్ సెంథిల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.'మాస్ జాతర' విషయానికొస్తే.. రవితేజ చేసిన రెగ్యులర్ కమర్షియల్ మూవీ. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆయన గత చిత్రాల మాదిరిగా రొటీన్లానే అనిపించింది. ట్రైలర్ ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ.. మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి? రవితేజకు ఇది 75వ మూవీ కావడం విశేషం. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు.శ్రీలీల హీరోయిన్. -
మాస్ మహారాజా మాస్ జాతర.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ఫుల్ యాక్షన్ మూవీ మాస్ జాతర. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజైన సూపర్ డూపర్ ఆనే సాంగ్‌ను రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.రిలీజ్ తేదీ మరో మూడు రోజులే ఉండడంతో ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే మాస్ జాతర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్రలో మాస్ మహారాజా కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజకు ప్రతినాయకుని పాత్రలో నవీన చంద్ర నటించారు. ఈ భారీ యాక్షన్ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే రవితేజ మరోసారి మాస్ హీరోగా ఆడియన్స్‌ను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రైల్వే ఎస్సైగా మాస్ మహారాజా సరికొత్తగా కనిపించనున్నారు. ట్రైలర్ రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఫైట్స్, విజువల్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ జోన్ ఉంటాయి.. నేను వచ్చాక ఒకటే జోన్.. వార్ జోన్ అనే డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరిస్తోంది. Ikkada antha okkate zone… adhi MASS MAHARAJ WAR ZONE! 👊⚔️🔥#MassJatharaTrailer Out Now – https://t.co/EsvmFE7ie0#MassJathara is set to deliver a full-on feast of action, fun & entertainment 💣This Oct 31st, theaters turn into a celebration! 🔥🔥#MassJatharaOnOct31st… pic.twitter.com/Ftd4xhug1r— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2025 -
రవితేజ- శ్రీలీల 'సూపర్ డూపర్ హిట్టు సాంగ్'.. చూశారా?
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja), హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ధమాకా' మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. మూడేళ్ల తర్వాత వీరి కలయికలో వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర (Mass Jathara Song). ధమాకాకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మూడు సాంగ్ వచ్చాయి. తూ మేరా లవ్వరు, ఓలే ఓలే.., హుడియో హుడియో.. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగో పాట రిలీజ్ చేశారు.సూపర్ డూపర్ హిట్టు సాంగ్అదే సూపర్ డూపర్ హిట్టు సాంగ్! ఈ పాటకు రిథమ్ లేదు.. కదం లేదు, పదం లేదు.. అర్థం లేదు.. పర్థం లేదు అంటూ సాగే ఈ పాట సూపర్ హిట్టని లిరిక్స్లోనే చెప్తున్నారు. రోహిణి, భీమ్స్ సిసిరోలియో ఆలపించిన ఈ పాట సూపర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. మాస్ జాతర విషయానికి వస్తే.. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. చదవండి: నటి గ్లామర్ పిక్స్ షేర్ చేసిన ఉదయనిధి స్టాలిన్.. ఎంత పనైపోయింది? -
నా కుమారుడి కెరీర్.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమా పరిశ్రమలో నిలదొక్కున్నారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన పిల్లలు కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షధ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయం గురించే మాట్లాడారు.రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’.. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ అట్లూరితో ప్రత్యేక చిట్‌చాట్‌లో రవితేజ పాల్గొన్నారు. ఆ సమయంలోనే రవితేజ పిల్లల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నానని రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. అయితే అదే మూవీకి మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పంచుకున్నారు. వెంటనే రవితేజ కూడా "నా కుమారుడితో పని చేయడం ఎలా అనిపించింది..?" అని సరదాగా అడగ్గానే.. వెంకీ నవ్వుతూ.. 'అతను చిన్నప్పటి నుంచే సినిమా సెట్ల మధ్యే పెరిగాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.. చాలా నేచురల్‌గా అనిపించింది' అని పేర్కొన్నారు. మహాధన్, చిన్నప్పుడు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సూర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. రాబోయే రోజుల్లో మహాధన్ హీరోగా నటిస్తాడా.. దర్శకుడిగా పరిచయం కానున్నాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు.కుమారుడి గురించి రవితేజ ఇలా చెప్పాడు. మహాధన్ కెరీర్ గురించి అక్కగా మోక్షధ గ్గరగా గమనిస్తోంది. వాడు ఏ విషయం అయినా సరే వాళ్ల అక్కతోనే పంచుకుంటాడు. తను కూడా వాడికి అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. వాడి కెరీర్ గురించి చూసుకునేందుకు మోక్షిధ ఉంది. అంటూ క్లారిటీ ఇచ్చారు. మోక్షధ కూడా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబినేషన్లో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న 'తక్షకుడు' చిత్రానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో రవితేజ ప్రొడక్షన్ హౌస్ పేరుతో సినిమాలు కూడా ఆమె నిర్మించే ఛాన్స్ ఉంది. -
రవితేజ ఊర మాస్ చూస్తారు!
-
వింటేజ్ రవితేజను గుర్తుచేస్తున్న 'హుడియో హుడియో'
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు.'హుడియో హుడియో' అంటూ సాగే ఈ గీతాన్ని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో హుషారుగా ఉండేలా తనదైన శైలిలో అద్భుతంగా స్వరపరిచారు. మాస్ చిత్రానికి తగ్గట్టుగా ఓ సరికొత్త మెలోడీని అందించారు. సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ తన మనోహరమైన స్వరంతో భీమ్స్‌తో కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
గాయంతోనూ షూటింగ్.. రవితేజ సహజ నటుడు : శ్రీలీల
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్గా నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేఫథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెచ్చింది చిత్రబృందం. తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక ఫన్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజపై హీరోయిన్ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు.రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు. -
నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే!
‘హుడియో హుడియో...’ అంటూ శ్రీలీలతో ఆడి పాడుతున్నారు రవితేజ. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ– హీరోయిన్ శ్రీలీల కలిసి ‘మాస్ జాతర’ లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31 విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘హుడియో హుడియో...’ అంటూ సాగే పాట ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ‘నా గుండె గాలిపటమల్లే ఎగరేశావే... నీ సుట్టు పక్కల తిరిగేలా గిరి గీశావే... నా కంటి రెమ్మల్లో కలలకు ఎరవేసావే... నీ కంటి చూపులతో కలలను ఉరితీశావే...’ అంటూ ఈ పాట సాగుతుంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడిన ఈ పూర్తి పాట బుధవారం విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె.వర్మ. -
అక్టోబర్‌లో రిలీజయ్యే సినిమాలివే..
చిత్ర పరిశ్రమలో సినిమాల విడుదలకు సంక్రాంతి సరైన పండగ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పందెం కోళ్లులాగా సంక్రాంతి బరిలో నిలిచేందుకు హీరోలు, దర్శక–నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కారణంగానే సంక్రాంతికి భారీపోటీ ఉంటుంది. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి పండగలు తమ సినిమాల విడుదలకు మంచి సమయం అని మేకర్స్ ఆలోచన. ఈ ఏడాది దసరా, దీపావళి పండగలు అక్టోబరులోనే రావడం విశేషం. సో.. సినిమా ప్రేమికులకు ఈ నెల సినిమాల పండగే అని చెప్పాచ్చు.ఈ నెల ఆరంభంలో ‘ఇడ్లీ కొట్టు, కాంతారా: చాప్టర్ 1’ వంటి డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇక ఈ నెలలోనే రవితేజ ‘మాస్ జాతర’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, ప్రియదర్శి ‘మిత్ర మండలి’, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’, కిరణ్ అబ్బవరం ‘కె.ర్యాంప్’, సాయికుమార్, అనసూయ ‘అరి’, రక్షిత్ అట్లూరి ‘శశివదనే’ వంటి పలు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అదే విధంగా ప్రభాస్ ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి. ‘బాహుబలి: ది ఎపిక్’గా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇవి మాత్రమే కాదు... ఇంకా పలు చిత్రాలు విడుదల కానున్నాయి. ఆ వివరాల్లోకి వెళదాం.బాహుబలి: ది ఎపిక్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ముఖ్య తారలుగా నటించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ 2015 జూలై 15న, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ 2017 ఏప్రిల్ 28న రెండు భాగాలుగా విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు పలు రికార్డులు, రివార్డులు సాధించింది.‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. తొలి, ద్వితీయ భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే కాదు... ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ చిత్రాన్ని రీ–రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఇప్పటికే విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక సినిమా ఎన్ని గంటలు ఉంటుంది? ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుంది? అనే వివరాలు తెలియాలంటే విడుదల వరకూ వేచి చూడాలి.థియేటర్లలో జాతర రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహించారు. రవితేజ నటించిన 75వ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. పైగా ‘ధమాకా’ (2022) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు వస్తోంది.‘‘రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ‘మాస్ జాతర’ రూపొందింది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఈ చిత్రాన్ని మలిచారు భాను భోగవరపు. ‘ధమాకా’ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా ‘మాస్ జాతర’ కోసం సూపర్ మ్యూజిక్ అందించారు. మా సినిమా థియేటర్లలో అసలు సిసలైన మాస్ పండగను తీసుకురాబోతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. మనసు హత్తుకునే తెలుసు కదా! ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తెలుసు కదా’.ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటించగా, వైవా హర్ష కీలక పాత్రపోషించారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.‘‘మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. మనసుని హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధాల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలు ప్రేక్షకులని అలరిస్తాయి. నీరజ కోన యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఇటీవల విడుదల చేసిన మా మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. తమన్ మ్యూజిక్ మా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్ తెలిపారు. ప్రేమ, వినోదాల ర్యాంప్ ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణుకథ, క’ చిత్రాల ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘కె ర్యాంప్’. జైన్ ్స నాని రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.‘‘లవ్, రొమాన్ ్స, యాక్షన్, ఫన్‌తో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘కె–ర్యాంప్’. కిరణ్ అబ్బవరం కెరీర్లో ఈ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే వాణిజ్య అంశాలు మా సినిమాలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మా టీజర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది.. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మా చిత్రం ఉంటుంది. చేతన్ భరద్వాజ్ సంగీతం మా మూవీకి ప్లస్ అవుతుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవ్వులు పంచే మిత్ర మండలి ‘బలగం, కోర్ట్’ చిత్రాల ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిత్ర మండలి’. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్. దర్శకత్వం వహించారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన నిహారిక ఎన్ఎం ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్నారు. బ్రహ్మానందం, రాగ్ మయూర్, ప్రసాద్ బెహ్రా ప్రధాన పాత్రలుపోషించారు. బీవీ వర్క్స్(బన్నీ వాసు) సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్పై కల్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.‘‘స్నేహం ప్రధానంగా నడిచే కథతో రూపొందిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఏ ఒక్కర్ని కూడా మా చిత్రం నిరుత్సాహపరచదు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అంటూ పేర్కొన్నారు మేకర్స్.తండ్రీ కొడుకుల అనుబంధం ‘పలాస 1978, నరకాసుర, ఆపరేషన్ రావణ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు రక్షిత్ అట్లూరి. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కోమలి ప్రసాద్ హీరోయిన్. తమిళ నటుడు శ్రీమాన్ కీలక పాత్రపోషించారు. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు.ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘శశివదనే’. ఇలాంటి కథా నేపథ్యం ఉన్న చిత్రం ఇదివరకు రాలేదు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ప్రేక్షకులను నిరాశపరచదు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. దీపావళికి డ్యూడ్ ‘ప్రేమలు’ వంటి అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రపోషించారు. ఈ మూవీ ద్వారా కీర్తీశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘డ్యూడ్’. న్యూ ఏజ్ కథాంశంతో పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ యువతరంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. సాయి అభ్యంకర్ అందించిన అద్భుతమైన మ్యూజిక్ ఆడియన్స్‌ని అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.సమాజానికి సందేశం సాయి కుమార్, అనసూయ భరద్వాజ్, వినోద్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. ‘పేపర్ బాయ్’ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘‘మా సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే వాణిజ్య అంశాలున్న మా చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. పోలీస్ కానిస్టేబుల్ ‘కొత్త బంగారు లోకం’ మూవీ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా మధులిక వారణాసి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జాగృతి మూవీ మేకర్స్ పై బలగం జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్పోలీస్ కానిస్టేబుల్ పాత్రపోషించారు.సుభాష్ ఆనంద్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘కానిస్టేబుల్..’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని హైదరాబాద్ మాజీపోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా ఈ నెలలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
వినాయకుడిపై ఒట్టేసి చెప్పిన రవితేజ.. ‘మాస్ జాతర’ వచ్చేది అప్పుడే!
రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతి మొదలు మొన్నటి వినాయక చవితి వరకు మూడు, నాలుగుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి.. వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి కొత్త డేట్‌ని వెల్లడించారు. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆది(Hyper Aadi)లపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు. చివరిగా వినాయకుడిపై ‘ఒట్టేసి చెబుతున్నా..అక్టోబర్ 31న రిలీజ్ పక్కా’ అని రవితేజ అనడంతో వీడియో ముగుస్తుంది.ఇప్పటికే విడుదలైన 'మాస్ జతర' టీజర్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా మాస్ రాజా అభిమానులను, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే, రెండు పాటలు విడుదలై శ్రోతల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నాయి. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా స్వరపరిచిన ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి అంటే, ప్రేక్షకులలో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Sankranthi Ayipoyindhi,Summer Ayipoyindhi,Vinayaka Chavithi Ayipoyindhi...#MassJathara Yepudu? 🤔Eesari matram release pakkaa!! 💥😎 Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025 -
ఆ రోజే మాస్ జాతర?
రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి పాత్ర చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారని టాక్. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్ సన్నాహాలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. మరి... వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే. -
ఆలస్యమైనా... అలరిస్తాం
చిత్ర పరిశ్రమలో సినిమాల రిలీజ్లు వాయిదా పడటం సాధారణమే. కానీ రిలీజ్లు దగ్గర పడుతున్న తరుణంలో విడుదల వాయిదా పడుతున్న సినిమాల సంఖ్య ఇటీవలి కాలంలో టాలీవుడ్లో పెరిగింది. ఆగస్టు నెలలో సినీ కార్మికుల సమ్మె ఓ కారణమైతే, భారీ చిత్రాల వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కి ఎక్కువ టైమ్ పట్టడం మరో కారణం... ఇలా పలు కారణాల వల్ల సినిమా రిలీజ్లు వాయిదా పడుతున్నాయి. కానీ అందరు మేకర్స్ చెబుతున్న మాట ఒకటే...‘ఆలస్యమైనా... అలరిస్తాం’ అని. అలా లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటున్న కొన్ని చిత్రాల గురించి ఓ లుక్ వేద్దాం.వేసవిలో విశ్వంభర విశ్వంభర చిత్రం ఈ ఏడాది థియేటర్స్‌లోకి రావడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడింది. సంక్రాంతి రిలీజ్ వాయిదా పడిన తర్వాత ‘విశ్వంభర’ చిత్రం ఈ ఏడాది చివర్లో అయినా రిలీజ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్‌ను వచ్చే వేసవికి వాయిదా వేశారు. వచ్చే ఏప్రిల్‌లో ‘విశ్వంభర’ చిత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించారు.త్రిష హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రంలో ఆంజనేయస్వామి భక్తుడు భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి కనిపిస్తారని, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి.. చిరంజీవి సిస్టర్స్‌గా కనిపిస్తారని, త్రిష ద్వి పాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. పధ్నాలుగు లోకాలు దాటి హీరో సత్యలోకానికి ఎలా చేరుకున్నాడు? అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకున్నాడు? అనే అంశాల నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు.దసరా బరిలో లేదుహీరో బాలకృష్ణ, దర్శకుడు బోయ పాటి శీను కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాను ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా సెప్టెంబరు 25న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ దసరా బరి నుంచి ‘అఖండ 2’ చిత్రం తప్పుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ గురువారం అధికారికంగా ప్రకటించారు.వీఎఫ్ఎక్స్ పనులు, రీ–రికార్డింగ్ పనులతో పాటు మొత్తం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని ఈ కారణంగా ‘అఖండ 2’ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నామని, ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఓ సెలబ్రేషన్‌లా ఉంటుందని చెబుతూ, ‘అఖండ 2’ సినిమా రిలీజ్ వాయిదాను గురువారం కన్ఫార్మ్ చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం డిసెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బాలకృష్ణ, బోయ పాటి కాంబినేషన్లో రూ పొందిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.సంక్రాంతి బరిలో... వచ్చే సంక్రాంతి బరిలో ‘ది రాజాసాబ్’ చిత్రం నిలిచింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ యాక్షన్ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తొలుత ‘ది రాజాసాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ఆ తర్వాత డిసెంబరు 5న రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు. తాజాగా ‘ది రాజాసాబ్’ సినిమాను 2026 జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ చిత్రనిర్మాత టీజీ విశ్వప్రసాద్ కన్ఫార్మ్ చేశారు.దీంతో డిసెంబరు 5 నుంచి జనవరి 9కి ‘ది రాజాసాబ్’ సినిమా వాయిదా పడినట్లు, అధికారిక సమాచారం వెల్లడైంది. ఇక తాత–మనవడు నేపథ్యంలో ఈ సినిమా ప్రధాన కథనం సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంలో ఈ చిత్రదర్శకుడు మారుతి స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్– ప్రభాస్ తాత–మనవడు పాత్రల్లో కనిపిస్తారని, ‘రాజా డీలక్స్’ అనే ఓ భవనం నేపథ్యంలో ఈ సినిమా మేజర్ కథనం సాగుతుందని తెలిసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగానే, సెప్టెంబరులో కేరళ వెళుతుంది చిత్ర యూనిట్. అక్కడ ప్రభాస్ పాత్ర తాలూకు ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తారట. ఆ నెక్ట్స్ విదేశాల్లో హీరో – హీరోయిన్లపై చిత్రీకరించే డ్యూయెట్ సాంగ్‌లతో ‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుందని తెలిసింది. ఫ్యాంటసీ హారర్ కామెడీ సినిమా కనుక, వీఎఫ్ఎక్స్–΄ోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటోందట చిత్రయూనిట్. టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్ జాతర రవితేజ కెరీర్‌లోని 75వ చిత్రం ‘మాస్ జాతర’. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల ఈ సినిమా కోసం మరోసారి జోడీ కట్టారు. అలాగే ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రవితేజ. ఇందులో రవితేజ లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావొచ్చింది. అయితే ఈ వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ కావాల్సిన ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా పడింది. ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన సమ్మె పరిస్థితులు, కొన్ని ఊహించని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్‌ను ఈ ఆగస్టు 27న రిలీజ్ చేయడం లేదని, త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలి పారు. అయితే ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ వాయిదా పడటం ఇదేం తొలిసారి కాదు.నిజానికి ఈ సినిమాను తొలుత 2025 సంక్రాంతి రిలీజ్‌కి ప్లాన్ చేశారు. ఆ తర్వాత మే 9కి, ఆ నెక్ట్స్ ఆగస్టు 27కి రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ ఈ తేదీల్లో రిలీజ్ కుదర్లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది అక్టోబరు చివర్లో లేదా నవంబరు ప్రారంభంలో ‘మాస్ జాతర’ చిత్రం విడుదల కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.హీరో వర్సెస్ డైరెక్టర్ ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకునే ఓ హీరో, ఓ డైరెక్టర్ మధ్య ఎందుకు విభేదాలు ఏర్పడ్డాయి? అసలు వీరి మధ్య ఏం జరిగింది? అన్న అంశాలతో రూ పొందిన పీరియాడికల్ చిత్రం ‘కాంత’. ఈ సినిమాలో సూపర్‌స్టార్ చంద్రన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, లెజెండరీ డైరెక్టర్ అయ్యా పాత్రలో సముద్ర ఖని నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటించారు.ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సెప్టెంబరు 12న రిలీజ్ అంటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. కానీ 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమా సెప్టెంబరు 12న రిలీజ్ కావడం లేదని ఫిల్మ్‌నగర్ సమాచారం. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు మేకర్స్. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోయ్ వర్గీస్ ఈ సినిమాను నిర్మించారు.తొమ్మిది గ్రంథాల నేపథ్యంలో... ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, మంచు మనోజ్ విలన్ రోల్ చేశారు. జగపతిబాబు, శ్రియా శరణ్, జయరామ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జా, బ్లాక్స్వార్డ్ పాత్రలో మంచు మనోజ్ నటించారు.ఈ సినిమాను తొలుత ఆగస్టు 1న రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ తాజాగా వారం రోజులు ఆలస్యంగా... అంటే సెప్టెంబరు 12న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అండ్ మైథలాజికల్ అడ్వెంచరస్ చిత్రం ప్రధానంగా తొమ్మిది గ్రంథాలు, ఓ మ్యాజికల్ స్టిక్ నేపథ్యంలో సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.ప్రేమలో సంఘర్షణ రష్మికా మందన్నా లీడ్ రోల్లో నటించిన తొలి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ లవ్‌స్టోరీ చిత్రంలో దీక్షిత్ శెట్టి మరో లీడ్ రోల్లో నటించారు. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాను సెప్టెంబరు 5న రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. కానీ ఈ సెప్టెంబరు 5న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం విడుదల కావడం లేదని, త్వరలోనే మేకర్స్ నుంచి కొత్త విడుదల తేదీ వస్తుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రేమలో ఓ యువతి పడే సంఘర్షణ తాలూకు అంశాలతో ఈ చిత్రకథనం సాగుతుందని తెలిసింది. సంబరాలు ఎప్పుడు? రాయలసీమ నేపథ్యంలో రూ పొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. ఈ చిత్రంలో సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్నారు. రోహిత్ కేపీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను గతంలో సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటంచారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ గురించి, మరో అప్డేట్ లేక΄ోవడంతో ఈ మూవీ సెప్టెంబరు 25న రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ 75 శాతం పూర్తయిందని ఓ సందర్భంలో మేకర్స్ తెలి పారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ వినిపిస్తోంది.కోచింగ్ సెంటర్ల నేపథ్యంలో... చాలా సినిమాల రిలీజ్లు పోస్ట్΄ోన్ అవుతుంటే చిన్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ రిలీజ్ మాత్రం ప్రీ పోన్ అయ్యింది. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్‘ వెబ్‌సిరీస్ ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ‘లిటిల్ హార్ట్స్’. ‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాను నిర్మించారు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాను తొలుత సెప్టెంబరు 12న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ సెప్టెంబరు 5కి ఈ సినిమాను ప్రీ పోన్ చేశారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నంది పాటి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. టీనేజ్ పిల్లల చదువు, లవ్‌స్టోరీ, కోచించ్ సెంటర్లు.. వంటి అంశాల నేపథ్యంలో ఈ ‘లిటిల్ హార్ట్స్’ చిత్రం సాగుతుందని తెలుస్తోంది. ఈ తరహాలో రిలీజ్ వాయిదా పడిన సినిమాలు, కొత్త రిలీజ్ డేట్లను కన్ఫార్మ్ చేసుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రవితేజ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ విడుదల వాయిదా పడుతున్నట్లు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే నిజమయ్యాయి. ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదల కావాల్సింది. కానీ ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు మరియు కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారుమాస్ జాతర విషయానికొస్తే.. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. -
వీరీ వీరీ గుమ్మడిపండు ఈ సినిమా వచ్చేదెప్పుడు?
ఒకప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్స్ దొరికితే చాలు... సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాన్–థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు, బాక్సాఫీస్పోటీ, ఓటీటీ సంస్థల నిబంధనలు... ఇలా ఓ సినిమా రిలీజ్ కావడానికి, కాకపోవడానికి చాలా కారణాలే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇంకా విడుదల వాయిదా పడుతూ వస్తున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.ఈ సెప్టెంబరు 5న చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అనుష్కా శెట్టి ‘ఘాటి’, రష్మికా మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’, తేజ సజ్జా ‘మిరాయ్’, ‘ది బెంగాలీ ఫైల్స్’, శివకార్తికేయన్ ‘మదరాసి’ వంటి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇన్ని సినిమాలు ఒకే తేదీకి రిలీజ్ కావడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో వీటిలో ఒకట్రెండు సినిమాలు వాయిదా పడే అవకాశం ఉందని, ఈ వాయిదా పడే చిత్రాల్లో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఉండొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సెప్టెంబరు 5న రిలీజ్ కావాల్సిన విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ చిత్రం సెప్టెంబరు 19కి వాయిదా పడింది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను అరుణ్ ప్రభు దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ – స్పిరిట్ మీడియా ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాయి. 200 కోట్ల రూ పాయల భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ ‘భద్రకాళి’ సినిమా కథనం సాగుతుంది.సంక్రాంతి సినిమాలపై ఎఫెక్ట్?నిర్మాతలు–సినీ కార్మికుల మధ్య వేతనాల పెంపు విషయమై చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు జరగడం లేదు. ఈ ప్రభావం సంక్రాంతి రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలపై పడొచ్చు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆగస్టు 5 నుంచి మొదలు కావాల్సిన ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ చిత్రీకరణ మొదలు కాలేదు. దీంతో షూటింగ్‌కు ఆలస్యమౌతోంది. సమ్మె కారణంగా ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకా రవితేజ ‘అనార్కలి’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ చిత్రబృందాలు తమ సినిమాలను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాయి. కానీ సినీ కార్మికుల ప్రస్తుత సమ్మె కారణంగా సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమాలపై ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. అలాగే డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమౌతున్న అడవి శేష్ ‘డెకాయిట్’ చిత్రంపై కూడా ఈ సమ్మె ప్రభావం కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.సత్యలోకానికి పయనం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ సినిమా ఇంకా థియేటర్స్‌లోకి రాలేదు. సంక్రాంతికి ‘విశ్వంభర’ సినిమా విడుదల కాకపోవడంతో సమ్మర్‌కి థియేటర్స్‌లోకి వస్తుందని ఆడియన్స్ ఊహించారు. కానీ సమ్మర్లో కూడా థియేటర్స్‌లోకి రాలేదు. ఆ మాటకొస్తే... ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత లేదు. చిరంజీవి హీరోగా నటించిన ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిష హీరోయిన్గా నటించగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు.బాలీవుడ్ నటి మౌనీ రాయ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ రెడ్డి నిర్మించిన ఈ ‘విశ్వంభర’ ఈ ఏడాది సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఇదిలా ఉంటే... ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో క్వాలిటీ పరంగా చిత్ర యూనిట్ రాజీ పడకుండాపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయిస్తోందని సమాచారం. గ్రాఫిక్స్ కోసమే రూ. 25 కోట్లకుపైగా బడ్జెట్‌ను మేకర్స్ కేటాయించారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే.ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీజర్ విడుదల కావొచ్చని, ఈ సినిమా విడుదల తేదీపై అప్పుడు ఓ స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక పద్నాలుగు లోకాలను దాటి, హీరో సత్యలోకం వెళ్లి, అక్కడ హీరోయిన్ను ఎలా కలుసుకుంటాడు? అనే నేపథ్యంలో ‘విశ్వంభర’ సినిమా కథనం సాగుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వశిష్ట పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో విశ్వంభర అనే పుస్తకం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ పుస్తకంలోని అంశాల ఆధారంగానే హీరో సత్యలోకానికి వెళ్తాడని, ఈ క్రమంలో హీరోకు సహాయం చేసే వ్యక్తి పాత్రలో రావు రమేశ్ నటించారని టాక్.ఆలస్యంగా రాజాసాబ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్, కామెడీ అండ్ ఫ్యాంటసీ సినిమా ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, వీటీవీ గణేశ్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డిసెంబరు 5న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కావడం లేదని, సంక్రాంతికి ఈ విడుదలయ్యే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం ‘ది రాజాసాబ్’ విడుదల వాయిదాకు ప్రధాన కారణమట. పైగా ఈ సినిమా కోర్టు కేసులో ఇరుక్కుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘ది రాజాసాబ్’ చిత్రం ప్రధానంగా తాత–మనవడి అనుబంధం నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.ఈ చిత్రంలో ప్రభాస్ తాతయ్య పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలిసింది. ఇంకా ఈ సినిమాలో ‘రాజా డీలక్స్’ అనే భవనం కూడా చాలా కీలకంగా ఉంటుందని, ఈ భవనం లోపలే ప్రధాన కథ జరుగుతుందని తెలిసింది.పండక్కి రానట్లే! రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల మళ్లీ జంటగా కలిసి నటిస్తున్న సినిమా ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వినాయక చవితి పండగ సందర్భంగా ఈ ఆగస్టు 27న విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ విడుదల వాయిదా పడిందని భోగట్టా.ఇంకా రెండు పాటల చిత్రీకరణ ఉందని, అలాగేపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కి కూడా ఇంకా సమయం పట్టేట్లు ఉందని... ఈ కారణాల వల్లే ‘మాస్ జాతర’ ఈ వినాయకచవితి పండక్కి థియేటర్స్‌లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను తొలుత ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత మే 9కి వాయిదా వేశారు. ఇటీవల ఆగస్టు 27న రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఆగస్టు 27న కూడా ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లక్ష్మణ్ భేరీ అనే రైల్వేపోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుందట. అలాగే హీరో రవితేజ–విలన్ నవీన్‌చంద్ర కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంటాయని తెలిసింది.సంబరాలు ఎప్పుడు? సాయి దుర్గా తేజ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’. రూ. 125 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ చైతన్యా రెడ్డి, కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్యా నాగళ్ల ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబరు 25న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.కానీ ఆ తర్వాత ఈ సెప్టెంబరు 25నే పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’, బాలకృష్ణ మైథలాజికల్ అండ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. దీంతో సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల వాయిదా పడుతుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 80 శాతంపైనే పూర్తయింది. కానీ విడుదల తేదీపై మేకర్స్ నుంచి మరోసారి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సెప్టెంబరు 25న ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి కాబట్టి ఈ తేదీకి ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా రాకపోవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి అతి త్వరలోనే ఓ స్పష్టత రావొచ్చు. ఇక రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని తెలిసింది.స్వయంభూ నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా, సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. కానీ ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. ఓ దశలో ఈ దసరాకు ‘స్వయంభూ’ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారట మేకర్స్. కానీ భారీ వీఎఫ్ఎక్స్, యుద్ధ సన్నివేశాలు ఉండటంతోపోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం పడుతుందని, ఈ పనులు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. శక్తికి, ధర్మానికి చిహ్నమైన సెంగోల్ (బంగారు రాజదండం) నేపథ్యంలో ‘స్వయంభూ కథనం సాగుతుందట. మరో విషయం ఏంటంటే... ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని సమాచారం.ఓం శాంతి శాంతి శాంతిః తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, సురభి ప్రభావతి, గోపరాజు విజయ్, శివన్నారాయణ (అమృతం అ΄్పాజీ) ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణ, అనూప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో కొండవీటి ప్రశాంతి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈషా రెబ్బా, వ్యాన్ యజమాని అంబటి ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.ఆ మధ్య ఈ సినిమాను ఆగస్టు 1న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆగస్టు 1న ఈ సినిమా విడుదల కాలేదు. కొత్త విడుదల తేదీపై మేకర్స్ నుంచి త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఇక మలయాళంలో సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రూపొందిందని తెలిసింది. భార్యాభర్తల నేపథ్యంలో ‘జయ జయ జయ జయహే’ సినిమా కథనం సాగుతుంది. మహిళలంటే చులకన భావం ఉన్న ఓ భర్తకు అతని భార్య ఏ విధంగా బుద్ధి చెప్పిందన్నదే ఈ సినిమా కథనం.భార్యాభర్తల కథ లావణ్యా త్రి పాఠి, దేవ్ మోహన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. భార్యాభర్తల అనుభందం నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి)’ చిత్రాల ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహించారు. నాగ మోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్‌ను విడుదల చేశారు. అయితే విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఇలా ఈ ఏడాదిలో రిలీజ్‌కు సిద్ధం అవుతూ, ఇంకా విడుదల తేదీని కన్ఫార్మ్ చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి. -
ఈసారైనా రవితేజ హిట్ కొడతాడా..?
-
రవితేజ 'మాస్ జాతర' మూవీ HD స్టిల్స్
-
రవితేజ 'మాస్ జాతర' టీజర్ రిలీజ్
గత కొన్నాళ్లుగా రవితేజ చేస్తున్న సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'మాస్ జాతర' అనే మూవీ చేశాడు. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా ఓ మాదిరి వైరల్ అయ్యాయి. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్)రవితేజ సినిమా అంటే ఏయే అంశాలు ఉంటాయో.. 'మాస్ జాతర' టీజర్ అలానే ఉంది. కామెడీ, ఫైట్స్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ.. రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు. శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు.. ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. నాగవంశీ.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
ఓలే ఓలే.. అన్ని బూతులే.. రవితేజ పాటపై విమర్శలు!
ఓలే ఓలే గుంటనీ అయ్యకాడ ఉంటానీ అమ్మకాడ తింటానీ వొళ్ళోకొచ్చి పంటాబుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదుమంచి లేదు మర్యాద లేదుఅంగీ లేదు లుంగీ లేదు పంచె లేదుతాడు లేదు బొంగరం లేదునీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని... పట్టుకుని కాళ్లు మొక్కి పోతాచదువుతుంటే ఇవేవో బూతు పదాల్లా అనిపిస్తున్నాయి కదా?.. కానీ ఇవి ఓ సినిమాలో ఉన్న జానపద గీతం లిరిక్స్. ఓ స్టార్ హీరో ఈ పాటకు స్టెప్పులేశాడు. నెట్టింట ఈ పాట తెగ వైరల్ అవుతుంది. కొంతమంది హీరోహీరోయిన్ల స్టెప్పులను ఎంజాయ్ చేస్తుంటే..మరికొంతమంది మాత్రం లిరిక్స్‌పై తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నారు. జానపద పాట పేరుతో బూతు పాటలు వినిపిస్తున్నారంటూ మండిపడుతున్నారు. #MassJathara songగుంట.. ఉంట.. పంట.. తింటా..నీ అమ్మని.. అక్కని.. చెల్లిని.. పట్టుకుని.....బుద్ది లేదు.. జానం లేదు.. సిగ్గు లేదు.. శరం లేదు..అంగీ లేదు.. లాగు లేదు.. లుంగీ లేదు.....Ole Ole లిరిక్స్..😡స్పెషల్ సాంగే కానీ వినడానికి దరిద్రంగా ఉంది.🤦#RaviTeja #Sreeleela pic.twitter.com/2i9RIBxOSp— Usha Rani Seetha (@RaniUshaa) August 6, 2025రవితేజ-శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ లో ఈ ఫోక్ సాంగ్ ఉంది. నిన్న పాటను విడుదల చేయగా.. కొన్ని గంటల్లోనే అది వైరల్ అయింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం లిరిక్స్‌పై మండిపడుతున్నారు. 'నీ యమ్మ...అక్క, తల్లి, చెల్లి...' 'బుద్ది, జ్ఞానం సిగ్గు, శరం లేదు...' లాంటి బూతులతోనే పాటని కంపోజ్ చేయడం, దానికి రవితేజ లాంటి స్టార్ హీరో డ్యాన్స్ చేయడం దారుమని కామెంట్ చేస్తున్నారు. ‘జానపదం లో ఇలాంటి పదాలు అసలు బూతులు కావంటూ మరికొంతమంది రవితేజకు సపోర్ట్‌గా పోస్టులు పెడుతున్నారు. Me listening to Ole Ole Song be like ....#MassJathara #OleOle #RaviTeja #Sreeleela pic.twitter.com/pgu1UQmtcD— Tharun Tej Musical Audios🎧💥 (@TejaTeja47057) August 5, 2025 ఈ మధ్య సినిమాలో జానపద పాటలు ఎక్కువగా వాడేస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు తెలంగాణ ఫోక్ సాంగ్స్ మాత్రమే సినిమాల్లో కనిపించేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర జానపద పాటలకు కూడా స్టార్స్ స్టెప్పులేస్తున్నారు. అవి బాగా వర్కౌట్ అవుతున్నాయి కూడా. అందుకే తాజాగా రవితేజ కూడా ఓ ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్‌కి స్టెప్పులేశాడు. రోహిణితో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ పాటను పాడాడు. Song ki baaga negative response vachindhi bro try changing the lyrics @vamsi84 or shorten the duration of the song. #OleOle #MassJathara https://t.co/54GSRaEnwK— EAGLE 🦅 (@RT_Zealot) August 6, 2025 -
రవితేజ మాస్ జాతర కౌంట్ డౌన్ స్టార్ట్...!
-
Mass Jathara: ‘ఓలే ఓలే' పాట రిలీజ్.. రవితేజ, శ్రీలీల డ్యాన్స్ అదుర్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి.. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన 'తు మేరా లవర్' అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండవ గీతంగా 'ఓలే ఓలే'ను విడుదల చేసింది చిత్ర బృందం. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా ఈ గీతముంది.ధమాకా జోడి రవితేజ-శ్రీలీల తెరపై కనిపిస్తే ఆ సందడే వేరు. 'ఓలే ఓలే' పాటతో ఈ జోడి మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు. రవితేజ తన వింటేజ్ స్టెప్పులతో అలరించారు. శ్రీలీల తన అసాధారణ నృత్య ప్రతిభతో మరోసారి కట్టిపడేశారు. ఇద్దరూ కలిసి ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా తెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. -
వినాయక చవితికి జాతర
ఆగస్టులో థియేటర్స్‌లో మాస్ జాతర అంటున్నారట రవితేజ. ‘ధమాకా’ వంటి బ్లాక్బాస్టర్ మూవీ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్ భేరి అనేపోలీసాఫీసర్పాత్రలో రవితేజ, విలన్‌గా నవీన్ చంద్ర నటిస్తున్నారని తెలిసింది.ఈ సినిమా టాకీపార్టు చిత్రీకరణ దాదాపు పూర్తయింది.పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉందట. కాగా ‘మాస్ జాతర’ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. -
చక్రి 'ఏఐ' వాయిస్ తో కొత్త పాట.. వింటేజ్ స్టెప్పులు
రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'(Mass Jathara Movie). శ్రీలీల హీరోయిన్. కొత్త దర్శకుడు భాను భోగవరపు తీస్తున్నాడు. లెక్క ప్రకారం మేలో రిలీజ్ అనుకున్నారు కానీ ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తొలి పాట రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)'తూ మేరా లవర్' అంటూ సాగే ఈ పాటని దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాయిస్ తో కంపోజ్ చేయడం విశేషం. 'ఇడియట్'లోని ఫేమస్ స్టెప్పులు మళ్లీ రవితేజనే వేసి ఆకట్టుకున్నాడు. శ్రీలీల(Sreeleela) కూడా గత చిత్రాలతో పోలిస్తే హాట్ గా ఉంది. భీమ్స్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?) -
మళ్ళీ ఇడియట్ రోజుల్లోకి మాస్ మహారాజా.. రిలీజ్ కు రెడీ అవుతున్న "మాస్ జాతర "
-
మాస్ జాతర.. మరోసారి 'ఇడియట్' స్టెప్పులేసిన రవితేజ
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ధమాకా బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి తు మేరా లవర్ అనే పాట రిలీజ్ చేశారు. 2002లో వచ్చిన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పాటే కాదు రవితేజ స్టెప్పులు కూడా రిపీట్ చేశాడు.ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. సామజవరగమన మూవీకి రైటర్‌గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. చదవండి: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే -
మాస్ మహారాజా 'మాస్ జాతర'.. గ్లింప్స్ వచ్చేసింది
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం 'మాస్ జాతర'. ఈ మూవీ రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా నిలవనుంది. ఈ సినిమాకు ‘సామజవరగమన చిత్రానికి రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్గా కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా నటించిన ధమాకా సూపర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇవాళ మాస్ మహారాజా బర్త్ డే కావడంతో ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మాస్ జాతర మూవీ గ్లింప్స్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. దాదాపు 61 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే మాస్ జాతరను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రం మే 09న థియేటర్లలో సందడి చేయనుంది. The Swag.The Energy.The Vibe. 🔥🔥🔥𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is here to deliver an ALL ROUND SHOW! 😎❤️🔥#MassJathara ~ Mass Rampage Glimpse out now 💥— https://t.co/1s6R68jgYG #HappyBirthdayRaviTeja garu ❤️@sreeleela14 @BhanuBogavarapu @vamsi84… pic.twitter.com/Tp9Zn1vouZ— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025 -
నెట్‌ఫ్లిక్స్‌లో పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. రాబోయే తెలుగు సినిమాలివే!
కరోనా తర్వాత ఓటీటీల వాడకం దేశవ్యాప్తంగా ఎక్కువైంది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం తగ్గించి.. ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఓటీటీలో సినిమాను వీక్షిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ ఇండియన్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్క్రీమింగ్ అవుతున్నాయి. అయినప్పటికీ మిగతా భాషలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారులు తక్కువగానే ఉన్నారు. అందుకే ఆ సంస్థ టాలీవుడ్‌పై ఫోకస్ చేసింది. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది మరింత మందిని తమ ఖాతాదారులుగా చేర్చుకునేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ పదులకొద్ది సినిమాలను కొనుగోలు చేసింది. టాలీవుడ్ చిత్రాలపై ఫోకస్ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ టాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలకు కాస్త దూరంగా ఉండేది.ఏడాది మూడు నాలుగు చిత్రాలు మాత్రమే రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలపై ఫుల్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ చిత్రాలను వరుసగా రిలీజ్ చేస్తుంది. గతేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్న అనేక చిత్రాల స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.ఇక 2025లోనూ నెట్‌ఫ్లిక్స్ అదే ఒరవడి కొనసాగించనుంది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు సినిమా జాబితాను ప్రకటించింది. ఈ సారి నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’, నాగచైతన్య ‘తండేల్’తో సహా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో విడుదలైన తర్వాత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. ఆ క్రేజీ ప్రాజెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం.OG is back, and everybody is about to feel the heat! 💥 OG is coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/TawVw3QavA— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025పవన్ ‘ఓజీ’.పవన్ కల్యాణ్ నటించాల్సిన సినిమాల్లో ఓజీ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే రాజకీయాల్లో పవన్ బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో మాత్రం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆ దిశగా పనులు కూడా ప్రారంభించారు. ఈ చిత్రంతో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా.. ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషించబోతున్నారు.నాగచైతన్య ‘తండేల్’ When fate drags them across borders, only courage can bring them home. 🌊❤️Thandel, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/uRMGVxk43n— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన తండేల్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ సైతం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. తండేల్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 7న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/FCCbwWHdcm— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 రవితేజ ‘మాస్ జాతర’రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. A man without a side and betrayal without limits.VD12, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release!#NetflixPandaga pic.twitter.com/WugL3yTprB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025వీడి12విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, రుక్మిణీ వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ని కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దీంతో పాటు నాని హిట్ 3, మ్యాడ్ స్క్వేర్, జాక్, అనగనగా ఒక రాజు సినిమాలను సైతం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
అరకులో ‘మాస్ జాతర’... రవితేజతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది. -
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024


