రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మాస్ జాతర'. నిన్న(అక్టోబరు 31) సాయంత్రం ప్రీమియర్లతో థియేటర్లలో రిలీజ్ చేశారు. నేటి(నవంబరు 1) నుంచి రెగ్యులర్ షోలు వేస్తున్నారు. టీజర్, ట్రైలర్ వచ్చినప్పుడు మూవీ గురించి సగటు సినీ ప్రేక్షకుడు పెదవి విరిచాడు. ఇప్పుడు థియేటర్లలో సినిమా చూసొచ్చినోళ్లు కూడా అలానే అంటున్నారు. సగటు రవితేజ చిత్రంలా రొటీన్‌గానే ఉందని అంటున్నారు. మరోవైపు తొలిరోజు ఇంకా పూర్తికాకుండానే నిర్మాణ సంస్థ కలెక్షన్ పోస్టర్ రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ ప్రకటించాక తొలిసారి కనిపించిన ఉపాసన)
తొలిరోజు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్లు పడ్డాయి. వీటికి ఓ మాదిరి రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. అలాంటిది ప్రీమియర్లలో ఏకంగా రూ.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచలేదు. ప్రీమియర్లు బాగానే వేసినప్పటికీ రూ.5 కోట్లు వచ్చాయా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
'మాస్ జాతర' విషయానికొస్తే.. లక్ష‍్మణ్ (రవితేజ) నిజాయితీ గల రైల్వే పోలీస్. వరంగల్‌లో పనిచేసే టైంలో మంత్రి కొడుకుని కొడతాడు. దీంతో అల్లూరి జిలాల్లోని అడవివరం రైల్వే స్టేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడ గిరిజన ప్రాంతాన్ని శివుడు (నవీన్ చంద్ర) శాసిస్తుంటాడు. గంజాయిని కోల్‌కతాకు స్మగ్లింగ్ చేయిస్తుంటాడు. లక్ష‍్మణ్ ఈ ఊరికి రావడంతోనే శివుడితో గొడవ పెట్టుకుంటాడు. రాజకీయంగా అండదండలు ఉన్న శివుడిని.. ఓ సాధారణ రైల్వే పోలీస్ ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో తులసి (శ్రీలీల), హనుమాన్ (రాజేంద్రప్రసాద్) ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: భార్యతో విడాకులు.. తప్పంతా నాదే: ఛత్రపతి శేఖర్)


