అల్లు అరవింద్ కుమారుడు, హీరో అల్లు శిరీష్ (Allu Sirish) ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి శిరీష్-నయనిక ఉంగరాలు మార్చుకున్నారు. తమ్ముడి ఎంగేజ్‌మెంట్ అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపించాడు. బన్నీ భార్య స్నేహ అల్ట్రా స్టైలిష్‌గా ముస్తాబైంది. వీరి గారాలపట్టి అర్హ ట్రెడిషనల్ డ్రెస్‌లో ఫుల్ క్యూట్‌గా ఉంది. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. చిరంజీవి కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా మెగా ఫ్యామిలీ
భార్య సురేఖ, కొడుకు రామ్‌చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన (Upasana Kamineni Konidela), కూతుర్లు శ్రీజ, సుష్మితతో కలిసి వచ్చారు. చిరంజీవి సోదరుడు నాగబాబు ఫ్యామిలీ మెంబర్స్ కూడా హాజరయ్యారు. బాబు పుట్టాక లావణ్య త్రిపాఠి ఇలా బయటకు రావడం ఇదే తొలిసారి! అలాగే ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత ఉపాసన కూడా బయట కనిపించడం ఇదే మొదటిసారి! వీళ్లిద్దరూ జిగేల్‌మనే రంగురంగుల డ్రెస్‌ల జోలికి వెళ్లకుండా సింపుల్‌గా కనిపించే హాఫ్ వైట్ దుస్తుల్లో మెరిశారు.

రెట్టింపు సంతోషంలో ఉపాసన
ఇక ఉపాసన ముఖం ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రామ్‌చరణ్-ఉపాసన 2012 జూన్ 14న వివాహం చేసుకున్నారు. జీవితంలో బాగా సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచించాలని నిర్ణయించుకున్నారు. అలా దాదాపు పదేళ్లు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. ఇక 2023 జూన్‌లో తొలి సంతానంగా క్లీంకార పుట్టింది. ఇటీవల దీపావళి సందర్భంగా ఉపాసన తన సీమంతం వీడియో షేర్ చేస్తూ త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించింది.

చదవండి: భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. నేనే వినలేదు: ఛత్రపతి శేఖర్


