ఈ వీకెండ్ థియేటర్లలోకి 'బాహుబలి ఎపిక్' రానుంది. రెండు భాగాల్ని కలిపి ఒకే మూవీగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్, రానా కలిసి స్పెషల్ వీడియో ఒకటి చేశారు. దాన్ని తాజాగా రిలీజ్ కూడా చేశారు. ఇది రిలీజైన ఒకరోజు తర్వాత రవితేజ 'మాస్ జాతర'.. బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. ఇది కాకుండా ఓ తమిళ డబ్బింగ్ మూవీ కూడా రావాల్సింది. కానీ తెలుగు మూవీస్ కోసం సదరు తమిళ హీరో సైడ్ అయిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
తమిళ హీరో విష్ణు విశాల్ లీడ్ రోల్ చేసి, నిర్మించిన సినిమా 'ఆర్యన్'. మానస చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కె. దర్శకత్వం వహించారు. లెక్క ప్రకారం ఈ 31వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కావాలి. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆర్యన్‌ని విడుదల చేస్తున్నారు. కానీ బాహుబలి రీ రిలీజ్, మాస్ జాతర కారణంగా తెలుగులో ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా అంటే నవంబరు 7న రిలీజ్ చేయనున్నారు. తమిళంలో మాత్రం యధావిధిగానే థియేటర్లలోకి రానుంది.
'మా 'ఆర్యన్' ఈ నెల 31న విడుదల కావాల్సి ఉంది. ఈ ప్రత్యేక తేదీన రవితేజగారి 'మాస్ జాతర'తో పాటు 'బాహుబలి ది ఎపిక్' సినిమాలు తెలుగు ప్రేక్షకులను ముందుకు రావడం మరింత ప్రత్యేకమైనది. ఆ సినిమాలను సెలబ్రేట్ చేసుకోవడం సరైనదని భావిస్తున్నాను. 'ఆర్యన్' నవంబరు 7న తెలుగులోకి వస్తుంది. నా నిర్ణయానికి అండగా నిలిచిన మా డిస్ట్రిబ్యూటర్లు సుధాకర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్' అని విష్ణు విశాల్ ఒక ప్రకటన విడుదల చేశాడు.
(ఇదీ చదవండి: నేను కూడా చిరుతో అప్పట్లో అనుకున్నా.. కానీ: మాళవిక మోహనన్)


