ఆ రోజే మాస్‌ జాతర? | Ravi Teja Mass Jathara movie updates | Sakshi
Sakshi News home page

ఆ రోజే మాస్‌ జాతర?

Sep 8 2025 12:07 AM | Updated on Sep 8 2025 12:07 AM

Ravi Teja Mass Jathara movie updates

రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాస్‌ జాతర’. ‘ధమాకా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో రవితేజ, హీరోయిన్‌ శ్రీలీల జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రైల్వే  పోలీస్‌ లక్ష్మణ్‌ భేరి పాత్ర  చేస్తున్నారు రవితేజ. విలన్‌గా నవీన్‌ చంద్ర కనిపిస్తారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో రవితేజ – శ్రీలీల కాంబినేషన్‌లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. అలాగే ఈ ఇద్దరూ పాల్గొనగా ఓ పాట చిత్రీకరణను కూడా  ప్లాన్‌ చేశారని టాక్‌. కాగా, ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్లీ ‘మాస్‌ జాతర’ అక్టోబరు 31న విడుదల కానుందని, ఈ దిశగా యూనిట్‌ సన్నాహాలు చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. మరి... వార్తల్లో ఉన్నట్లుగా ఆ రోజే వెండితెరపై మాస్‌ జాతర కనిపిస్తుందా? వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement