
రవితేజ హీరోగా దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara). ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతి మొదలు మొన్నటి వినాయక చవితి వరకు మూడు, నాలుగుసార్లు రిలీజ్ డేట్ ప్రకటించి.. వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మరోసారి కొత్త డేట్‌ని వెల్లడించారు. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’తో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆది(Hyper Aadi)లపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా పడటాన్ని సరదాగా ఎగతాళి చేయగా.. ఆలస్యానికి గల కారణాలపై రవితేజ అంతే చమత్కారంగా స్పందించారు. చివరిగా వినాయకుడిపై ‘ఒట్టేసి చెబుతున్నా..అక్టోబర్ 31న రిలీజ్ పక్కా’ అని రవితేజ అనడంతో వీడియో ముగుస్తుంది.
ఇప్పటికే విడుదలైన 'మాస్ జతర' టీజర్ కి అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా మాస్ రాజా అభిమానులను, మాస్ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే, రెండు పాటలు విడుదలై శ్రోతల నుంచి భారీ ప్రశంసలు అందుకున్నాయి. అందరూ కాలు కదిపేలా ఎంతో ఉత్సాహభరితంగా స్వరపరిచిన ఈ పాటలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. రవితేజ-శ్రీలీల జోడి అంటే, ప్రేక్షకులలో ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Sankranthi Ayipoyindhi,
Summer Ayipoyindhi,
Vinayaka Chavithi Ayipoyindhi...#MassJathara Yepudu? 🤔
Eesari matram release pakkaa!! 💥😎
Mass Maharaaj @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo @vidhu_ayyanna @NavinNooli @Naveenc212… pic.twitter.com/8V86FiYAkX— Sithara Entertainments (@SitharaEnts) October 1, 2025