మాస్ మహారాజా రవితేజ మరో ఫుల్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆయన నటించిన మాస్ జాతర ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రవితేజ యాక్షన్, డైలాగ్ మాస్ ఆడియన్స్ను అలరిస్తున్నాయి. ఈ మూవీని భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ధమాకా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీలీల మరోసారి రవితేజ సరసన కనిపించనుంది. ఈ మూవీ కోసం మాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు.
రిలీజ్కు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల తన డ్యాన్స్తో మరోసారి ఆడియన్స్ను అలరించింది. రవితేజతో కలిపి స్టెప్పులతో అదరగొట్టేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హీరో సూర్య మాట్లాడుతూ..' రవితేజకు నేను కూడా అభిమానినే. ఇది నాకు ఫ్యాన్ భాయ్ మూమెంట్. ఆయన ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ నటనకు బిగ్ ఫ్యాన్ నేను. తమిళంలోనూ రవితేజ సినిమాలకు అద్భుతమైన క్రేజ్ ఉంది. విక్రమార్కుడు మూవీ కార్తీ కెరీర్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ మాస్ జాతర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాను కల నిజం కావాలి. ఈనెల 31 మరో బ్లాక్ బస్టర్ చూడబోతున్నాం' అని అన్నారు. కాగా.. రవితేజ, శ్రీలీల జంటగా వస్తోన్న మాస్ జాతర అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
The joy, the excitement, and the MASS vibe all in one frame! 🔥
Pics from the Grand Pre Release event of #MassJathara ❤️🔥
Premieres Worldwide on Oct 31st from 6 PM Omwards! 😎🤘
Mass Maharaja @RaviTeja_offl @Sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/bAqv31Lym8— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2025


