
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర. మనదే ఇదంతా అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ధమాకా బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ సినిమా నుంచి తు మేరా లవర్ అనే పాట రిలీజ్ చేశారు. 2002లో వచ్చిన ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే పాటకు రీమిక్స్ చేసి దీన్ని రూపొందించారు. పాటే కాదు రవితేజ స్టెప్పులు కూడా రిపీట్ చేశాడు.
ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న విడుదల చేయనున్నారు. సామజవరగమన మూవీకి రైటర్‌గా పనిచేసిన భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. విధు అయ్యన్న సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది.
చదవండి: అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్లు.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే